రాష్ట్రాలకు కేంద్రం రూ. 9,871 కోట్ల గ్రాంట్ విడుదల

17 రాష్ట్రాలకు నాల్గవ నెలవారీ పోస్ట్‌ డెవల్యూషన్‌ రెవెన్యూ లోటు (పిడిఆర్‌డి) గ్రాంట్లు రూ. 9,871 కోట్లను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ ఇన్‌స్టాల్‌మెంట్‌ విడుదలతో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.39,894 కోట్లను ఆర్హత గల రాష్ట్రాలకు విడుదల చేసినట్లు అధికారిక ప్రకటనలో పేర్కొంది. 

15వ ఆర్థిక కమిషన్‌ సిఫారసుల ప్రకారం… నెలవారీ వాయిదాలలో రాష్ట్రాల రెవెన్యూ ఖాతాలలో అంతరాన్ని తగ్గించడానికి 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను 17 రాష్ట్రాలకు ఈ గ్రాంట్లు విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్‌, అస్సాం, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, మణిపూర్‌, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్‌, పంజాబ్‌, రాజస్తాన్‌, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్‌, పశ్చిమబెంగాల్‌లకు ఈ గ్రాంట్లు విడుదల చేసినట్లు 15వ ఆర్థిక కమిషన్‌ తెలిపింది. 

రాష్ట్రాల అంచనా వ్యయాలు, ఆదాయాల మధ్య అంతరాన్ని 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను అంచనా వేసిన లోటును పరిగణనలోకి తీసుకుని ఆయా రాష్ట్రాలకు ఈ గ్రాంట్లను మంజూరు చేస్తుంది.