గోహత్య నిరోధక చట్టాలు కఠినంగా అమలు చేయండి

గోహత్య నిరోధక చట్టాలు కఠినంగా అమలు చేయమని,  గో అక్రమ రవాణా అరికట్టడానికి కఠిన చర్యలు చేపట్టాలని, గో అక్రమ రవాణాదారులకు, గోహంతకులకు కొమ్ముకాస్తున్న ఎఐఎంఐఎం పార్టీ నాయకులపై పిడి చట్టం ప్రయోగించాలని విశ్వ హిందూ పరిషద్ తెలంగాణ శాఖ డిమాండ్ చేసింది.
 
డిజిపి మహేందర్ రెడ్డిని పరిషద్ రాష్ట్ర ప్రతినిధి వర్గం కలిసి సమర్పించిన వినతి పత్రంలో గోభక్తులపై వేధింపులు మానుకోవాలని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన డిజిపి తగు చట్టపరమైన చర్యలు చేపడుతానని వారికి హామి ఇచ్చారు.

పరిషద్  ప్రతినిధి బృందంలో రాష్ట్ర అధ్యక్షులు ఎం రామరాజు, రాష్ట్ర కార్యదర్శి బండారి రమేష్, గోరక్షా విభాగ్ దక్షిణ భారత్ ఇంఛార్జ్ టి. యాదగిరిరావు, తెలంగాణ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్, భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్, పరిషద్  నగర అధ్యక్షులు శ్రీనివాస రాజు, గోరక్షా విభాగం అఖిల భారత అద్యక్షులు జస్మత్ పటేల్ తదితరులు పాలొన్నారు. 
 
చాలామంది ఎఐఎంఐఎం నేతలు గూండాల వలే వ్యవహరిస్తూ గోవులు, పశువుల అపహరణ, వాటిని వధించటగంలో పాల్గొంటున్నారని వారు ఆరోపించారు. అయినా వారిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు. 
 
ఆరోగ్యకరమైన గోవులు, పశువుల గురించి తప్పుడు ఆరోగ్య సర్టిఫికెట్ లు జారీచేసి, వాటి వద్దకు అవకాశం కల్పిస్తున్న వారిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.  గోవుల అపహరణ, వధలకు పాల్పడే వారితో కొందరు పోలీస్ అధికారులు కూడా చేతులు కలుపుతున్నరని ఆరోపిస్తూ, అటువంటి వారిని గుర్తించి, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
దురదృష్టవత్తు నేరస్థులను వదిలి వేస్తూ, గోరక్షకులపై కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బక్రీద్ వస్తున్న సందర్భంగా అదనపు చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి గోవుల తరలింపులపై నగరంలో, రాష్ట్ర సరిహద్దులలో నిఘా ఏర్పాటు చేయాలని వారు కోరారు.