టీకాలలో బ్రిటన్, అమెరికాను దాటేసిన భారత్ 

దేశంలో కరోనావైరస్సం టీకాలు వేసుకున్న వారి సంఖ్య 32 కోట్లు దాటింది. ఆదివారం దేశంలో 17, 21 268 మందికి టీకాలు ఇచ్చారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 32 కోట్ల 36 లక్షల 63 వేల 297 మందికి టీకాలు ఇచ్చిన‌ట్ల‌య్యింది. 

ఫ‌లితంగా ప్రపంచంలోనే భారతదేశం అత్య‌ధిక టీకాలు వేసిన‌  దేశంగా అవతరించింది. గ్లోబల్ వ్యాక్సిన్ ట్రాకర్ అందించిన నివేదిక ప్రకారం బ్రిటన్, అమెరికా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, భారత్‌ల‌లో వ్యాక్సినేష‌న్ వేగంగా కొన‌సాగుతోంది.

ఇక్క‌డ‌ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… భారతదేశంలో టీకాలు వేసే కార్యక్ర‌మం ఈ ఏడాది జనవరి 16 నుంచి ప్రారంభం కాగా, బ్రిటన్‌లో గ‌త ఏడాది డిసెంబర్ 8 న, యూఎస్‌లో డిసెంబర్ 14 న, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్‌ల‌లో డిసెంబర్ 27 న మొద‌ల‌య్యింది. 

జూన్ 28న ఉదయం 8 గంటల స‌మ‌యానికి బ్రిటన్‌లో 7 కోట్ల, 67 లక్షల 74 వేల 990, అమెరికాలో 32 కోట్ల, 33 లక్షల, 27 వేల 328, ఇట‌లీలో 4 కోట్లు 96 లక్షల 50 వేల 721, జర్మనీలో  7 కోట్ల 14 లక్షల‌ 37 వేల 514, ఫ్రాన్స్‌లో 5 కోట్ల 24 లక్షల 57 వేల 288 మందికి టీకాలు వేశారు. ఇదే స‌మ‌యంలో భారతదేశంలో ఈ సంఖ్య 32 కోట్ల, 36 లక్షల 63 వేల 297గా ఉంది. 

భారతదేశంలో జూన్ 27 న 13.9 లక్షల మందికి టీకా మొదటి డోసు, 3.3 లక్షల మందికి టీకా రెండవ డోసు ఇచ్చారు. ఏప్రిల్ ఒక‌టి నుంచి దేశంలో 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయడం ప్రారంభించారు. మే ఒక‌టి నుంచి 18 నుంచి 44 ఏళ్లలోపు వారికి టీకాలు వేయడం ప్రారంభించారు.

మరణాలు కూడా వెయ్యి లోపు నమోదయ్యాయి. సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం… 46,148 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణయ్యాయి. నిన్నటి కంటే 7.7 శాతం తక్కువ. మరో 979 మంది మరణించారు. ఏప్రిల్‌ 13 తర్వాత వెయ్యి లోపు మరణాలు సంభవించడం ఇదే తొలిసారి.

మొత్తంగా 3,02,79,331 మంది కరోనా బారిన పడగా… 3.96 లక్షల మందిని కరోనా బలితీసుకుంది. గడిచిన 24 గంటల్లో 58, 578 మంది కరోనా నుండి బయటపడగా… ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2,93,09,607 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 5,72,994 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇ