మహిళతో ముద్దు .. మంత్రి పదవికి రాజీనామా

సహాయకురాలితో ముద్దు తెచ్చిన తంటాతో చివరకు బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి పదవికి ఎసరుపెట్టింది. మహిళకు ముద్దులు పెడుతున్న ఫోటో మీడియాలో బయటకు రావడంతో దుమారం చెలరేగింది. కుటుంబ సభ్యులు కానివారితో భౌతిక దూరం పాటించాలన్న నిబంధనను సాక్షాత్తు మంత్రే కాలరాశారని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. 
ఈ మేరకు ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ప్రస్తుత కరోనా వ్యాప్తి సమయంలో నిబంధనలను అతిక్రమించి సహాయకురాలిని ముద్దుపెట్టుకున్నారని మాట్‌ హాంకాక్‌పై ఆరోపణలు ఉన్నాయి. ద సన్ టాబ్లాయిడ్ కవర్ పేజీ ఫోటో గత 24 గంటలుగా మొత్తం ప్రపంచ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.
సోషల్ మీడియా ట్రోలింగ్స్ సరేసరి. ఫోటో తనదో కాదో తేల్చి చెప్పాల్సిన పరిస్థితి ఎదురవడంతో ఆరోగ్యశాఖ మంత్రి మాట్ హన్ కాక్ ఫోటోలో ఉన్నది నేనే.. అంటూ అంగీకరించారు.  ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో సోషల్ డిస్టెన్స్ పాటించలేకపోయాను.. సారీ.. అంటూ క్షమాపణలు కోరుతూ ప్రకటన చేశారు. 
 ‘వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో సాధారణ ప్రజలు చేస్తున్న త్యాగాలు చూస్తే.. మనం వారికి ఏదైనా తప్పు చేస్తే.. నిజాయితీగా ఉండటం మన బాధ్యత అవుతుంది’ అని తన రాజీనామా లేఖలో హాంకాక్‌ పేర్కొన్నారు.

బ్రిటన్ ఆరోగ్యశాఖ వెబ్ సైట్ లో ఆమె ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నట్లు మహిళతో చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న ఆయన విమర్శకుల ఆరోపణలకు ఈ ఫోటో ద్వారా బలం చేకూరింది.  
కరోనా కట్టడి చర్యలకు సంబంధించిన అనేక కాంట్రాక్టులు తనకు నచ్చిన వారికి.. తన సన్నిహితులకే కట్టబెడుతున్నారన్న విమర్శలను  విపక్ష లేబర్ పార్టీ మరోసారి తెరపైకి తెచ్చి విమర్శలు తీవ్రం చేసింది. 
 
దీంతో రాజకీయ వేడిని చల్లార్చేందుకు మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు మ్యాట్ హన్ కాక్ ప్రకటించారు. కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో ఎన్నో త్యాగాలు చేసిన ప్రజలకు ప్రభుత్వం రుణపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 
ఇలాఉండగా, 42 ఏండ్ల వయసున్న హాంకాక్‌, 15 ఏండ్ల క్రితం పెండ్లి చేసుకున్నాడని, భార్య మార్తతో ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యారని సన్‌ పత్రిక తన కథనంలో తెలిపింది. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో సహవిద్యార్థిగా ఉన్న సమయంలో పరిచయంతో హాంకాక్‌ ఆమెను తన సహాయకురాలిగా నియమించుకున్నారని, ఆమెను పెండ్లి కూడా చేసుకున్నట్లు సమాచారం ఉన్నదని ది సన్‌ పత్రిక తన కథనంలో పేర్కొన్నది. తనతో హాంకాక్‌ ముద్దు సీన్‌ వివాదం కావడంతో హాంకాక్‌ కన్నా ముందే ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా తెలిసింది.