
కోవిడ్ చికిత్సకు అయ్యే ఖర్చు, కోవిడ్ కారణంగా మృతి చెందిన వారికి ఇచ్చే ఎక్స్‌గ్రేషియాలపై పన్ను మినహాయింపులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగి కోవిడ్ చికిత్సకు కంపెనీలు చెల్లించే మొత్తానికి పన్ను మినహాయింపు వర్తిస్తుందని తెలిపింది.
కోవిడ్‌తో మరణించిన ఉద్యోగి కుటుంబాలకు కంపెనీలు చెల్లించే పరిహారానికి కూడా ఈ మినహాయింపు వర్తిస్తుందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
వివాద్ సే విశ్వాస్ పథకం గడువును మరో రెండు నెలలు (ఆగస్టు 31 వరకు) పొడిగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఫారం-16 గడువును జులై 15 నుంచి జులై 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. అలాగే నిబందనల ప్రకారం మొదటిసారి ఇల్లును కొనుగోలు చేస్తే దానిపై పెట్టె పెట్టుబడిపై పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇప్పుడు ఈ గడువును జూన్ 30 నుంచి మరో 3 నెలలు పొడగించింది.
ఆర్థిక లావాదేవీలు, ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలో కీలకమైన ఆధార్- పాన్ కార్డు అనుసంధాన ప్రక్రియ గడువును కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. అంటే సెప్టెంబర్ 30 వరకు పాన్ కార్డు దారులు తమ ఆధార్ కార్డుతో అనుసంధానించుకోవచ్చు. ఈ నెలాఖరుతో ముగియనున్న ఈ గడువును మరో దఫా పొడిగించింది.
More Stories
అమెజాన్, వాల్మార్ట్లపై ఆంక్షలు తొలగింపుకై వత్తిడి
జులైలో పట్టాలపైకి దేశంలో తొలి హైడ్రోజన్ రైలు
మార్కెట్లో ప్రవేశించిన రూ 500 నకిలీ నోట్లు