‘‘నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ… వీళ్ళందరి ఇంటి పేర్లలో ‘మోదీ’ ఎలా ఉందబ్బా? ఈ దొంగలందరి ఇంటి పేరు ఒకే విధంగా ‘మోదీ’ ఎలా అయిందబ్బా?’’ అని అన్నారని బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ ఆరోపించారు.
2019 ఏప్రిల్‌లో పూర్ణేష్ మోదీ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. మోదీ అనే ఇంటి పేరు ఉన్నవారినందరినీ రాహుల్ గాంధీ అవమానించారని ఆరోపించారు. ఈ కేసులో 2019 అక్టోబరులో రాహుల్ గాంధీ సూరత్ కోర్టులో హాజరయ్యారు. తాను తప్పు చేయలేదని కోర్టుకు తెలిపారు.
తదుపరి విచారణ జూన్ 24న జరుగుతుందని కోర్టు ప్రకటించింది. దీంతో రాహుల్ గాంధీ గురువారం కోర్టుకు హాజరయ్యారు. తాను ఏ వర్గాన్నీ లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో కేవలం వ్యంగ్యంగా మాట్లాడానని పేర్కొన్నారు. దీని గురించి తనకు ఇంత కన్నా ఎక్కువగా జ్ఞాపకం లేదని చెప్పారు.
కాగా, కోర్ట్ కు హాజరు కావడానికి ముందు చేసిన ఓ ట్వీట్ లో అస్తిత్వ రహస్యం పట్ల భయపడేది లేదంటూ రాహుల్ స్పష్టం చేశారు. ఈ కేసులో 2019 అక్టోబర్‌లో రాహుల్ ఇంతకు ముందు హాజరై.. ఆరోపణల్ని నమోదు చేయొద్దని, తన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని కోర్టును అభ్యర్థించారు కూడా.
More Stories
తుది దశకు చేరుకున్న వామపక్ష తీవ్రవాదం
దుర్గామాతపై గర్భా గీతం రాసిన ప్రధాని మోదీ
గోమాత విజ్ఞాన పరీక్షా పోస్టర్ ఆవిష్కరించిన భగవత్