ప్రపంచ నంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌గా జడేజా

ప్రపంచ నంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌గా జడేజా

టీమ్‌ఇండియా క్రికెటర్‌, స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ నంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌గా ఆవిర్భవించాడు. ఐసిసి తాజాగా విడుదల చేసిన టాప్‌ ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలోకి చేరుకున్నాడు. 

2017 ఆగ‌స్ట్ త‌ర్వాత ఆల్‌రౌండ‌ర్ల జాబితాలో జ‌డేజా నంబ‌ర్ వ‌న్‌ స్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి. ఈ జాబితాలో టీమిండియా ఆల్‌రౌండర్‌ అశ్విన్‌ 353 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. రెండు రేటింగ్‌ పాయింట్ల ఆధిక్యంతో జేసన్‌ హోల్డర్‌ (384)ను రెండో స్థానంలోకి నెట్టేశాడు. 

బెన్‌స్టోక్స్‌ (377), రవిచంద్రన్‌ అశ్విన్‌ (353), షకిబ్‌ అల్‌ హసన్‌ (338).. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా నిలిచారు. ఆల్‌రౌండర్ల విభాగంలోనే కాకుండా బౌలర్ల జాబితాలోనూ అశ్విన్‌ టాప్‌-5లో ఉన్నాడు. 850 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్యాట్‌ కమిన్స్‌ (908) అగ్రస్థానంలో ఉండగా, టిమ్‌ సౌథీ (830) మూడో ర్యాంకులో నిలిచాడు. 

ఇక బ్యాటింగ్‌ విషయానికొస్తే.. ఐసీసీ టాప్‌ 10 ప్లేయర్స్‌ జాబితాలో ముగ్గురు భారత ఆటగాళ్లు కొనసాగుతున్నారు. టీమిండియా సారధి విరాట్‌ కోహ్లీ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని 814 రేటింగ్‌ పాయింట్లతో నాలుగో స్థానంలో నిలువగా, రిషబ్‌ పంత్‌(747), రోహిత్‌ శర్మ(747) వరుసగా 6, 7 ర్యాంకుల్లో ఉన్నారు. 

ఈ జాబితాలో ఆసీస్‌ మాజీ సారథి స్టీవ్‌ స్మిత్‌(891) టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతుండగా, కేన్‌ విలియమ్సన్‌(886), మార్నస్‌ లబూషేన్‌(878) వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లాండ్‌ సారథి జో రూట్‌ (797) ఐదో స్థానంలో ఉండగా రిషభ్‌ పంత్‌, రోహిత్‌ శర్మ 747 పాయింట్లతో సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచారు.

మరోవైపు, బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ.. మూడు స్థానాలు మెరుగుపరచుకుని 3వ ర్యాంక్‌లోకి దూసుకురాగా, ఆసీస్‌ పేసర్‌ పాట్‌ కమిన్స్‌(908) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 

ఈ జాబితాలో భారత స్టార్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ 850 పాయింట్లతో రెండులో, ఆసీస్‌ సీమర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ 816 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. 

ఇక జట్ల విభాగంలో 123 రేటింగ్‌ పాయింట్లతో న్యూజిలాండ్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, భారత్‌(121), ఆస్ట్రేలియా(108), ఇంగ్లండ్‌(107)లు వరుసగా 2, 3, 4 ర్యాంక్‌ల్లో నిలిచాయి.