
అమెరికాకు చెందిన పెంటగాన్ గత పదేండ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద రహస్య సైన్యాన్ని సృష్టించింది. ఈ వాదనను అమెరికాకు చెందిన న్యూస్‌వీక్ పత్రిక తన కథనంలో మద్దతు తెలిపింది. అయితే, అమెరికా ప్రభుత్వం మాత్రం ఈ ప్రచారాన్ని తిరస్కరించింది.
‘ఇన్సైడ్ ది మిలిటరీ సీక్రెట్ అండర్‌కవర్ ఆర్మీ’ పేరుతో ఈ అమెరికా మ్యాగజైన్‌లో ఈ ప్రత్యేక నివేదికను ప్రచురించారు. రెండేండ్ల దర్యాప్తు తర్వాత ఈ ఇంటెలిజెన్స్ ఆర్మీలో దాదాపు 60 వేల మంది పనిచేస్తున్నట్లు తేలిందని తమ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. వారిలో చాలామంది నకిలీ గుర్తింపులను కూడా కలిగి ఉన్నారని, ఇంకొందరు తక్కువ ప్రొఫైల్స్‌లో నివసిస్తున్నారని వెల్లడించింది.
దాని కార్యక్రమాలన్నీ విస్తృతంగా ‘సిగ్నేచర్ రిడక్షన్’ గా సూచిస్తారని తన కథనంలో తెలిపింది. ప్రత్యేక సైనిక చర్యలతో పాటు మిలటరీ ఇంటెలిజెన్స్ నిపుణులను కూడా ఈ రహస్య సైన్యంలో చేర్చినట్లు తెలుస్తున్నది. జాతీయ నిఘా ఏజెన్సీ డైరెక్టర్ జారీచేసిన ఉద్యోగుల కీలక లక్షణాల ప్రకారం వీరంతా చాలా ధైర్యంగా, సాహసంతో, సృజనాత్మకంగా పని చేస్తుంటారు.
సామజిక, రాజకీయ వత్తిడులకు అతీతంగా అత్యున్నత నైతిక సామర్ధ్యం ప్రదర్శించాలని మార్గదర్శక సూత్రాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైన ప్రక్రియ అని నిపుణులు వాదిస్తున్నారు. ఇది సైనిక విధానాలు, సాంస్కృతిక గుర్తింపుపై కూడా ప్రభావం చూపుతుందని వారు అంటున్నారు. ఈ విషయంపై యూఎస్ కాంగ్రెస్ ఎప్పుడూ చర్చించలేదని సమాచారం.
More Stories
ఇరాన్‌పై బలప్రయోగం వద్దని చైనా, రష్యా హెచ్చరికలు
ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులు
సంయుక్త ప్రకటన లేకుండా ముగిసిన జి7 సదస్సు