అమూల్‌ కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

అమూల్‌ కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. అమూల్‌తో గత ఏడాది జులైలో కుదుర్చుకున్న ఎంవోయూపై ఎలాంటి నిధులు వెచ్చించొద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అమూల్‌తో ప్రభుత్వ ఒప్పందాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌ వేశారు. 
 
రఘురామ తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణరావు  వాదనలు వినిపించారు. నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు గుజరాత్‌లోని అమూల్‌కి నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. అమూల్‌తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంపై ఎలాంటి నిధులు ఖర్చు చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. 
 
ఈ నెల 14వ తేదీకి కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఏపీడీడీఎఫ్ ఆస్తులను లీజు పద్ధతిలో అమూల్ సంస్థకు బదిలీ చేస్తూ సీఎం జగన్ అధ్యక్షత కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టులో రఘురామ సవాల్ చేశారు. ఈ నిర్ణయాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించి, రద్దు చేయాలని కోరుతూ ఆయన పిల్ దాఖలు చేశారు.
 
ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ ‘అమూల్‌’ రాష్ట్రంలో పాగా వేసేందుకు రంగం సిద్ధమైంది. ఏపీలో పాల సేకరణపై అమూల్‌ దశల వారీ కార్యాచరణ చేపట్టింది. ప్రైవేట్‌ డెయిరీలకు చెక్‌ పెట్టి, సహకార డెయిరీలను నిర్వీర్యం చేసేలా ఆ సంస్థకు ప్రభుత్వమే వత్తా సు పలుకుతోంది. 
 
పాడి రైతుకు లీటరుకు రూ.4 బోనస్‌ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని మరిచి, అమూల్‌ పాలు కొంటే అదనపు లాభం వస్తుందని సెలవిస్తోంది. ఈ క్రమంలోనే అమూల్‌, ఏపీ డెయిరీ డెవల్‌పమెం ట్‌ ఫెడరేషన్‌ మధ్య ఒప్పందం కుదిర్చింది. రాష్ట్రంలో పాల సేకరణకు యం త్రాంగమే లేని అమూల్‌కు రైతు భరోసా కేంద్రాల ద్వారా పాలు సేకరించి ఇ వ్వనుంది. 
 
ఈ ప్రాజెక్టు అమలు కోసం ఇప్పటికే జిల్లాకో ప్రత్యేక అధికారిని నియమించడంతో పాటు, జిల్లాస్థాయి కమిటీలు వేసింది. తొలిదశలో సీఎం సొంత జిల్లా కడప తో పాటు పాల ఉత్పత్తి అధికంగా ఉన్న చిత్తూరు, ప్రకాశం జిల్లాలపై అమూల్‌, పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ దృష్టి పెట్టాయి.