
పాకిస్తాన్‌లో హిందూ వ్యాపారి అశోక్ కుమార్ గత నెల 31 న దారుణహత్యకు గురయ్యారు. పాకిస్థాన్ సైన్యం మద్దతు గల `డెత్ స్క్వాడ్’ వారడిగిన ముడుపులు చెల్లించడానికి నిరాకరించడంతో ఆక్రమిత బలూచిస్తాన్ లో ఉదయం 10 గంటలకు వ్యాధా బజార్ లో ఒక వ్యక్తి కాల్పులు జరిపి హత్య చేసినట్లుగా తెలుస్తున్నది.
కరడుకట్టిన ఇస్లామిక్ తీవ్రవాది షఫీక్ మెంగళ్ నేతృత్వంలోని `డెత్ స్క్వాడ్’ ఈ దురాగతానికి పాలపడిన్నట్లు స్థానికులు న్యూస్ చానెల్స్ కు తెలిపారు. పాకిస్తాన్ సైన్యం అదుపులో పనిచేసే షఫీక్ మంగళ్ ఆక్రమిత బలూచిస్తాన్ లో అన్ని అక్రమ, హింసాయుత కార్యక్రమాలకు పాల్పడుతూ ఉంటాడు.
వ్యాపారవేత్త హత్యకు నిరసనగా మైనార్టీలు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. దాంతో ఖుజ్దార్-కరాచీ మధ్య పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇటువంటి దురాగతాలు నుండి వ్యాపారులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అశోక్ కుమార్ హంతకులను సహితం వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంతకు ముందు కూడా ఆక్రమిత బలూచిస్తాన్ అంతటా సైన్యం, ఐ ఎస్ ఐ మద్దతుగల `డెత్ స్క్వాడ్’లు వారడిగిన ముడుపులు చెల్లించనందుకు ప్రతిగా దోపిడీలు, హిందూ వ్యాపారుల అపహరణాలు, హత్యలు జరిపిన అనేక సంఘటనలు జరిగాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మోటారు సైకిళ్లపై వచ్చిన గుర్తు తెలియని సాయుధ వ్యక్తులు వాద్ బజార్‌లోని అశోక్ కుమార్ అనే వ్యాపారిపై తన దుకాణంలో కూర్చుని ఉన్న సమయంలో కాల్పులు జరిపారు. దాంతో అశోక్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. సమీపంలోని దవాఖానకు తీసుకెళ్లగా అక్కడ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
హిందూ వ్యాపారిని చంపిన సమాచారం తెలియగానే వాద్ బజార్‌లోని వ్యాపారులు తమ దుకాణాలను మూసివేసి జాతీయ రహదారిపై బారికేడ్లు వేసి అడ్డుకున్నారు. దాంతో ఖుజ్దార్-కరాచీ మధ్య పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది.
పాకిస్తాన్‌లో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన మైనారిటీలపై దారుణానికి సంబంధించిన అంశంపై భారత ప్రపంచ ఫోరం సెక్రటరీ జనరల్ పునీత్ సింగ్ చందోక్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లో నివసిస్తున్న సిక్కు మత సమాజానికి లేదా భారతదేశానికి చెందిన హిందూ మతం వారికి ఎటువంటి అపాయం జరుగకుండా ఉండటానికి భద్రతా వ్యవస్థను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
More Stories
అయిల్ క్షేత్రాలు, రక్షణ కార్యాలయంపై మెరుపు దాడులు
తొలిసారి ఐసీసీ ట్రోఫీ విజేతగా దక్షిణాఫ్రికా
మిస్సైల్ దాడులను ఆకపోతే టెహ్రాన్ కాలిపోతుంది