
దివాలా అంచున ఉన్న పాకిస్తాన్‌కు రూ.22 వేల కోట్ల రుణాలు మాఫీ చేయడానికి మిత్రదేశం చైనా నిరాకరించడంతో చిక్కుల పడింది. ఇంత మొత్తం రుణం చెల్లించలేక పాకిస్తాన్ ఆపసోపాలు పడుతున్నది. ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన పాకిస్తాన్‌కు చైనా రుణ మాఫీ నిరాకరణ మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టేట్లుగా కనిపిస్తున్నది.
చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కింద ఇచ్చిన 300 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.22 వేల కోట్లు) రుణాన్ని మాఫీ చేయాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం చైనాను అభ్యర్థించింది. నివేదిక ప్రకారం, సీపీఈసీ కింద చేపట్టిన ఇంధన ప్రాజెక్టుకు ఇచ్చిన రుణాన్ని చైనా మాఫీ చేయాలని, దానిని పునర్నిర్మించాలని పాకిస్తాన్ కోరింది.
అయితే, పాకిస్తాన్ విజ్ఞప్తిని చైనా తోసిపుచ్చింది. దీంతో చైనా ఇచ్చిన అప్పులను ఎలా తీర్చాలన్న సందిగ్ధంలో పాకిస్తాన్ పడిపోయింది. ఇప్పుడు అప్పుల భారంకన్న పాకిస్తాన్ డిఫాల్ట్ ప్రమాదాన్ని ఎక్కువగా ఎదుర్కోనున్నది. పాకిస్తాన్ డిసెంబర్ వరకు దాదాపు 4 29,400 మిలియన్ (దాదాపు రూ.22 లక్షల కోట్లు) రుణాలు పొందింది.
ఇది ఆ దేశ జీడీపీలో 109 శాతం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, 2023 చివరి నాటికి ఈ నిష్పత్తి 220 శాతం వరకు చేరనున్నది. అప్పుడు 5 సంవత్సరాల ఇమ్రాన్ ప్రభుత్వం పదవీకాలం కూడా పూర్తవుతుంది. అప్పులు లేని పాకిస్తాన్‌ను తయారుచేస్తానని ఎన్నికల సమయంలో ఇమ్రాన్‌ఖాన్ చేసిన వాగ్దానాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు.
ఇప్పటికే పాకిస్తాన్ తీవ్రమైన ఆర్ధిక చిక్కులలో ఉన్నది. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో భారత్ కన్నా ఆర్ధికంగా మెరుగుగా ఉన్న పాకిస్థాన్ ఇప్పడు భారత్ జిడిపి కన్నా పదిరెట్లు వెనుకబడింది. బాంగ్లాదేశ్ కన్నా చాలా వెనుకబడింది.
More Stories
పీఓకేలో తలదాచుకున్న మసూద్ అజార్
తమకేమైనా జరిగితే ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌దే బాధ్యత
రెసిస్టెన్స్ ఫ్రంట్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా