వైసీపీ పాలన మొదలైనప్పటి నుంచి ఇసుక, మట్టి దోపిడీ సాగుతోంది. పెట్టుబడులు లేక, పరిశ్రమలు రాక అభివృద్ధి అట్టడుగుకు చేరింది. రాష్ట్రం నుంచి సుమారు రూ 1. 50 లక్షల కోట్ల పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. వీరి పాలనలో ఒక్క పరిశ్రమ వచ్చింది లేదని విమర్శించారు. రాష్ట్రంలో సుమారు 32 లక్షల మంది పైగా నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు.
నవరత్నాలు పేరు చేపట్టి ఫించన్ తీసుకోవాలంటే నిబంధనలు, ఇళ్ల పట్టాల విషయంలో నిబంధనలు అంటూ అర్హులయిన పేదవారిని పక్కన పెట్టేశారని, తెల్ల కార్డులు రద్దు చేశారని విమర్శించారు. నిబంధనల పేరిట ప్రతి పథకంలో కోతలు విధిస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టి, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని దుయ్యబట్టారు. దేవాలయాల మీద దాడులు జరిగాయి. దేవతా విగ్రహాలను పడగొట్టారు. రథాలు దగ్దం చేశారు. ఇప్పటి వరకు ఒక్క కేసులో అయినా పురోగతి ఉందా దర్యాప్తు చేసి నింధితుల్ని శిక్షించిన సందర్భం ఉందా? అని ప్రశ్నించారు.
రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేలంతా పేదల ఇళ్ల పట్టాల ముసుగులో పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దోచుకున్నారని మహేష్ ఆరోపించారు. ఇసుక అక్రమ తరలింపులో వైసీపీ భాగస్వామ్యం లేదా? అని నిలదీశారు. వీరి పాలనలో బీసీ, ఎస్సీ, ముస్లిం మైనారిటీలు ఇలా అన్ని వర్గాల దాడులు జరుగుతున్నాయని, వాటిని నియంత్రించగలిగారా? అని అడిగారు. సంక్షేమ పథకాల ముసుగులో ప్రజల్ని ఎల్లకాలం మోసగించలేరని అంటూ మీకు మిగిలిన మూడేళ్లలో పాలన తీరు మార్చుకోవాలని హితవు చెప్పారు.
More Stories
పోలవరంకు కేంద్రం రూ.2,800 కోట్లు విడుదల
‘స్వర్ణాంధ్ర విజన్’ సాకారానికి సహకరించండి
ధర్మవరంలో “హ్యాండ్లూమ్ క్లస్టర్” ఏర్పరచాలి