మధ్యాహ్న భోజన పథకానికి అవసరమయ్యే వ్యయాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ (డిబిటీ) ద్వారా అర్హులైన 11.8 కోట్ల మంది పిల్లలకు నగదు సాయం చేయాలన్న ప్రతిపాదనను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశంక్ ఆమోదించారు.
మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమానికి ప్రేరణను ఇవ్వనుంది. ఇది ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎం-జికెఎవై) కింద 80 కోట్లమంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ 5 కిలోల చొప్పున ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ గురించి భారత ప్రభుత్వం చేసిన ప్రకటనకు ఇది అదనం.
ఈ నిర్ణయం పిల్లల పౌష్టికాహార స్థాయిలను పరిరక్షించేందుకు తోడ్పడడమే కాక, సవాలుతో కూడిన మహమ్మారి సమయంలో వారి రోగ నిరోధక శక్తిని రక్షించేందుకు తోడ్పడుతుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.1200 కోట్ల అదనపు నిధులను అందించనుంది.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ఏకోపయోగ ప్రత్యేక సంక్షేమ చర్య దేశవ్యాప్తంగా ఉన్న 11.20 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి చదువుతున్న సుమారు 11.8 కోట్ల మంది విద్యార్ధులకు లబ్ధి చేకూర్చనున్నది.
More Stories
బయటపడిన మావోయిస్టుల భారీ ఆయుధాల డంప్
99.1 కోట్లకు చేరిన భారత ఓటర్ల సంఖ్య
మహారాష్ట్రలో పుష్పక్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో 12 మంది మృతి