అల్లోపతితో డయాబెటిస్ తగ్గిన ఒక్కడి పేరు చెప్తే రూ 2 కోట్లు

ఈ ప్రపంచంలో గత వంద సంవత్సరాల లో అల్లోపతి మందులతో డయాబెటిస్ తగ్గిన ఒక్కడి పేరు చెప్తే మీకు రెండు కోట్లు బహుమతి ఇస్తానని జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి లక్ష్మణరెడ్డిని వీరమా చినేని రామకృష్ణ బహిరంగ సవాల్ చేశారు. అలాగే మీకు తెలిసిన వంద మంది డయాబెటిస్ వారిని తన  దగ్గరకు పంపితే, వారిలో ఒక్కడికి తగ్గకపోయినా తాను తప్పు అని ఒప్పుకొని రెండు కోట్లు మీకు బహుమతి ఇచ్చి, ప్రజా జీవితం నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. 

ఆనందయ్య మందును శాస్త్రీయ నిరూపణ చేశాకే ప్రజలకు పంపిణీ చేయాలని లక్ష్మణ్ రెడ్డి చెప్పింది అల్లోపతికి వర్తించదా అని ప్రశ్నించారు. అల్లోపతి మాత్రమే ప్రపంచంలో అతి పెద్ద సైన్స్ అనేది నిర్వివాదాంశం అని చెప్పారు.  అందులో జీవనశైలి వ్యాధుల చికిత్స పేరిట దూరిన మందుల కంపెనీలు ఇరికించిన తప్పుడు గైడ్ లైన్స్ కారణంగా కోట్ల మంది బలి అయ్యారని రామకృష్ణ తెలిపారు. ఇప్పటికీ బలి అవుతూనే ఉన్నారని చెబుతూ డయాబెటిస్ చేస్తున్న విధ్వంసం అంతులేనిది పేర్కొన్నారు.

కరోనా మరణాలలో కూడా డయాబెటిస్ దే సింహ భాగం అని స్పష్టం చేశారు. భూమి పుట్టాక ఒక్కడికీ డయాబెటిస్ రివర్స్ చేయలేని అశాస్త్రీయ అల్లోపతి మందులు నిషేదించమని మీరు ఎప్పుడయినా పోరాడారా? అంటూ లక్ష్మణరెడ్డిని సూటిగా ప్రశ్నించారు. ఆనందయ్య గారి మందులో శాస్త్రీయత ఉందో లేదో తనకు తెలియదని, కాలం తేలుస్తుందని రామకృష్ణ తెలిపారు. పైగా, ఆనందయ్య గారు అల్లోపతిని సవాల్ చేయలేదని గుర్తు చేశారు. 

కానీ తాను డయాబెటిస్ కు మందులు వాడటం గురించి అల్లోపతి గైడ్ లైన్స్ మీద తీవ్రస్థాయిలో దాడి చేస్తున్నానని స్పష్టం చేశారు. కానీ ఎవ్వరు ఈ సవాల్ ను స్వీకరించడం లేదని విచారం వ్యక్తం చేశారు. 

“ఒక మందు అల్లోపతినా, ఆయుర్వేదమా, నాటుమందా, ఆహార విధానమో ప్రజలకు అవసరం లేదు. మాకు కావలసింది రోగం తగ్గటం, సైడ్ ఎఫెక్ట్స్ రాకపోవటం మాత్రమే” అని రామకృష్ణ స్పష్టం చేశారు. సైన్స్ రెండు రకాలు.. ఒకటి నిజం సైన్స్రెం, డోది సైన్సు ముసుగులో దాక్కున్న దొంగ సైన్స్. ఈ రెండూ ఒకటి కాదని గుర్తించాలని హితవు చెప్పారు. 

రోజుకు లక్ష బిల్లు వేసి జనాన్ని దోచుకున్న కార్పోరేట్ హాస్పిటల్స్ మీద మీలాంటి ప్రజా సేవకులు పోరాడతారు అని మాలాంటి వాళ్ళు భావిస్తుంటే పోయి పోయి అమాయకుడు, ఏదో తనకు తెలిసిన మంచిని సొంతడబ్బులతో పంచుదామనుకున్న ఆనందయ్య మీద పడ్డారని విచారం వ్యక్తం చేశారు. ఆనందయ్య మీద పెట్టే కాన్సంట్రేషన్ లో వందో వంతు పైన జరుగుతున్న దోపిడీ ల మీద పెట్టి ప్రజలకు మేలు చేయమని రామకృష్ణ హితవు చెప్పారు.