ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన రాజకీయ కురువృద్ధ్దుడు, ప్రముఖ గాంధేయవాది, తొలి దశ తెలంగాణ ఉద్యమకారుడు, రాజనీతిజ్జుడైన మాజీ జెడ్పీ చైర్మన్ చేకూరి కాశయ్య (89) సోమవారం తెల్లవారుజామున హైద్రాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు.
గత కొన్ని రోజుల నుంచి క్యాన్సర్‌తో బాధపడుతూ హైద్రాబాద్‌లో చికిత్స పొందుతున్న ఆయన గుండెపోటు రావడంతో మరణించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భారత ప్రధాని పివి. నర్సింహరావుకు అత్యంత సన్నిహితులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పని చేసిన చాలా ముఖ్యమంత్రులతో కాశయ్యకు సత్సంబంధాలు ఉన్నాయి.
నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డికి ప్రియ శిష్యుడిగా మెలిగారు. రాజకీయాల్లోకి రాకముందు కొత్తగూడెం ప్రాంతం లో ఉపాధ్యాయుడిగా పని చేశారు. అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఆశీస్సులతో కొత్తగూడెం సమితి అధ్యక్షులుగా రెండు పర్యాయాలు ఎన్నికయ్యారు. రెండు పర్యాయాలు కొత్తగూడెం ఎమ్మెల్యేగా పని చేశారు.
తొలుత 1972లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలువగా, రెండోసారి 1978లో జనతా పార్టీ నుంచి గెలుపొందారు. తెలంగాణ ప్రజా సమితి తరపున ఖమ్మం పార్లమెంట్‌కు పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థ్ధి లక్ష్మికాంతమ్మ చేతిలో కేవలం పది ఓట్ల తేడాతో ఒడిపోయారు. ఆ తరువాత ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్‌కు చైర్మన్‌గా 1987 నుంచి 1992 వరకు పని చేశారు.
అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుకు వ్యతిరేకంగా విమద్‌లాల్ కమిషన్ ఏర్పాటు చేయించి కమిషన్ ముందు హజరై సాక్షం ఇచ్చి సంచలనం సృష్టించారు. విద్యార్థ్ధి దశ నుంచే రాజకీయాల్లో ఉన్న ఆయన చివరి వరకు నమ్మిన విలువలకు కట్టుబడి ఉన్నారు. 1946లో మధిర రైల్వేస్టేషన్‌కు హాజరైన జాతిపిత మహత్మగాంధీ ఉపన్యాసంతో ఆయన గాంధేయవాదిగా మారారు. ఖమ్మం నగరంలో గురుదత్త ఫౌండేషన్ ఏర్పాటు చేయించి పకృతి వైద్యంను పరిచయం చేశారు. వృద్ధ్దాశ్రమం, యోగా కేంద్రం, గ్రంథాలయంను ఏర్పాటు చేశారు.
గాంధేయవాది అయిన చేకూరి కాశయ్య మరణం బాధాకరమని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గాంధీ సిద్దాంతాలను పాటిస్తూ జీవితాంతం ఖాదీని ధరించడమే కాకుండా ఎంతో సౌమ్యంగా ఉండేవారని తన పట్ల ఎంతో అభిమానంగా ఉన్నారని ఆయన తన సంతాప సందేశంలో నివాళులు అర్పించారు.
చేకూరి మరణం విషయం తెలియగానే ఖమ్మం నగరంలో గురుదక్షణ ఫౌండేషన్‌లో ఉంచిన ఆయ న భౌతిక కాయాన్ని రాష్ట్ర రవాణా ఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపి నామా నాగేశ్వర్‌రావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వర్‌రావు తదితరులు సందర్శించి నివాళ్లులు అర్పించారు.
చేకూరి కాశయ్య మరణం పట్ల సిఎం కెసిఆర్ సంతాపం వ్యక్తం చేశారు. స్వాతంత్ర సమరయోధుడుగా, తెలంగాణ అభ్యుదయవాదిగా, ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన నిస్వార్థ రాజకీయనేతగా చేకూరిని సిఎం గుర్తుచేసు కున్నారు. చేకూరి కాశయ్య మరణంతో నిజాయితీ కలిగిన ఒక సీనియర్ రాజనీతిజ్ఞున్ని రాష్ట్రం కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.
More Stories
రుణమాఫీపై బహిరంగ చర్చకు రేవంత్ కు ఏలేటి సవాల్!
ముందు చెరువుల్లో దుర్గంధాన్ని తొలగించండి రేవంత్
బంజారా మ్యూజియం ప్రారంభించిన ప్రధానికి కృతజ్ఞతలు