చైనాకు 143.3 శాతం ఎక్కువగా ఇంజినీరింగ్ ఎగుమ‌తులు 

తూర్పు ల‌డ‌ఖ్‌లోని గ‌ల్వాన్ లోయ‌లో చెలరేగిన స‌రిహ‌ద్దు వివాదంపై చైనాతో దౌత్య సంబంధాలు క్లిష్టంగా మారినా, సరిహద్దు వినాడానికి ఇంకా తెర పాడకపోయినా డ్రాగ‌న్‌తో వాణిజ్య లావాదేవీల్లో భార‌త్ గ‌ణ‌నీయ పురోగ‌తే సాధించింది. 

2020-21తో పోలిస్తే ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం తొలి నెల‌లో చైనాకు ఇంజినీరింగ్ ఎగుమ‌తులు 128 శాతం పెరిగాయి. అంటే గ‌తేడాది 4.8 బిలియ‌న్ డాల‌ర్ల విలువైన ఎగుమ‌తుల‌ను చైనాకు చేసింది భార‌త్‌. గ‌తేడాది ఏప్రిల్ నుంచి మొద‌లైన వాణిజ్య ప్ర‌క్రియ‌లో 25 కీల‌క దేశాల్లో 23 మార్కెట్ల‌కు భార‌త్ ఇంజినీరింగ్ ఎగుమ‌తులు జ‌రిపేది. 2020-21తో పోలిస్తే 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రం తొలి నెల‌లో అమెరికా, చైనా, జ‌ర్మ‌నీ, ఇట‌లీ త‌దిత‌ర దేశాల‌కు ఎగుమ‌తులు సానుకూల రికార్డులు న‌మోద‌య్యాయి.

ఇప్ప‌టికీ భార‌త ఇంజినీరింగ్ ఎగుమ‌తుల‌కు అమెరికా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఆ త‌ర్వాత స్థానం చైనాది. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం తొలి నెల‌లో అమెరికాకు ఎగుమ‌తులు 400 శాతానికి పైగా పెరిగాయి. అయితే, చైనాకు మాత్రం 143.3 శాతం ఎగుమ‌తుల్లో గ్రోత్ న‌మోదైంద‌ని ఇంజినీరింగ్ ఎక్స్‌పోర్ట్స్ ప్ర‌మోష‌న్ కౌన్సిల్ (ఈఈపీసీ) వెల్ల‌డించింది.

కానీ, మ‌లేషియా, సింగ‌పూర్‌ల‌కు భార‌త్ ఎగుమ‌తులు త‌గ్గిపోయాయి. ప్ర‌పంచ దేశాల‌న్నీ క‌రోనా మ‌హ‌మ్మారితో విల‌విల్లాడుతున్నా, భార‌త్ వివిధ దేశాల‌కు 73.1 బిలియ‌న్ డాల‌ర్ల విలువైన ఎగుమ‌తులు చేసి రికార్డు నెల‌కొల్పింది. కొవిడ్ మ‌హమ్మారి తీవ్ర‌త కొన‌సాగుతున్నా గ‌త కొన్ని నెల‌లుగా ఎగుమ‌తులు ఊపందుకున్నాయ‌ని ఈఈపీసీ ఇండియా చైర్మ‌న్ మ‌హేశ్ దేశాయ్ చెప్పారు.

32 ఇంజినీరింగ్ వ‌స్తువుల ఎగుమ‌తిలో పాజిటివ్ గ్రోత్ రికార్డైంది. 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంతో పోలిస్తే గ‌త నెల‌లో ఉక్కు, స్టీల్ ఎగుమ‌తుల్లో 210 శాతం వ్రుద్ధి సాధించింది. నాన్ ఫెర్ర‌స్ సెగ్మెంట్‌లోని అల్యూమినియం, జింక్‌, నికెల్‌, లెడ్‌, టిన్ త‌దితర ఉత్ప‌త్తుల ఎగుమ‌తులు 110 శాతం పెరిగాయి. 2020 ఏప్రిల్‌తో పోలిస్తే మొత్తం వాణిజ్య ఎగుమ‌తులు గ‌త నెల‌లో 10.4 బిలియ‌న్ల డాల‌ర్ల నుంచి 30.6 బిలియ‌న్ల డాల‌ర్ల‌కు పెరిగాయి.