ఆంగ్‌సాన్ సూకీ కోర్ట్ కు హాజరు.. తమది ప్రజల పార్టీ అని స్పష్టం 

మ‌య‌న్మార్ నాయ‌కురాలు ఆంగ్‌సాన్ సూకీ నాలుగు నెలల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి ప్ర‌జ‌ల మ‌ధ్య క‌నిపించారు. ఆమె ప్రభుత్వంపై గ‌త ఫిబ్ర‌వ‌రిలో సైనిక తిరుగుబాటు చేసి సూకీని నిర్బంధించింది. అప్ప‌టి నుంచి సూకీ సైనిక నిర్బంధంలో ఉన్నారు. కాగా సోమవారం కోర్టు ముందు హాజరైన సమయంలో ఆమె తన వ్యక్తిగత లాయర్లను కలిసి వారితో 30 నిమిషాల పాటు చర్చించడానికి అవకాశం కల్పించారు.
 
సైనిక తిరుగుబాటులో అధికారం నుండి తొలగించిన ఆమె నెలకొల్పిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీని గుర్తింపు రద్దు చేయడం ద్వారా ఎన్నికలలో పోటీ చేయకుండా సైనిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్నికల కమీషన్చే స్తున్న ప్రయత్నాలను ఈ సందర్భంగా ఆమె కొట్టిపారవేసారు. 
 
గత నవంబర్ లో జరిగిన ఎన్నికలలో ఆమె పార్టీ అక్రమాలకు పాల్పడినట్లు ఆమె పార్టీని ఎన్నికల కమీషన్ రద్దు  చేయబోతున్నట్లు గతవారం వార్తలు వచ్చాయి. పార్టీని ప్రజలకోసం ఏర్పాటు చేశామని, ప్రజలు ఉన్నంతకాలం పార్టీ ఉంటుందని ఆమె స్పష్టం చేసిన్నట్లు  ఆమె చెప్పిన్నట్లు  ఆమె న్యాయ నిపుణుల బృందం అధినేత ఖిన్ మాంగ్ ఝా మీడియాకు చెప్పారు. సూకీ ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు.
 
నిర్బంధంలో ఆమెకు వార్తాపత్రికలు చదివే అవకాశం లేదని, బయట ఏం జరుగుతుంద‌నే విష‌యంలో ఆమె కొద్ది సమాచారం మాత్ర‌మే ఉందని ఝా తెలిపారు. గత నవంబర్ ఎన్నికల్లో ప్రభుత్వం భారీగా అవకతవకలకు పాల్పడిందనే సాకుతో అక్కడి సైన్యం ప్రభుత్వాన్ని చేజిక్కించుకుంది.
 
అనంతరం సూకీ సహా సుమారు నాలుగు వేల మందిని అరెస్ట్ చేశారు. అంతే కాకుండా సూకీపై దేశ బహిష్కరణ కూడా విధించారు. అక్రమ రీతిలో వాకీ టాకీలను కలిగి ఉన్నట్లు సూకీపై ఆరోపణలు ఉన్నాయి. కానీ, సైనిక చర్యను వ్యతిరేకిస్తూ మయన్మార్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళ‌న‌ల్లో ఇప్ప‌టివ‌ర‌కు 800 మంది ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు.