కరోనాపై పోరాడేందుకు భారత రక్షణ సంస్థ డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన 2డీజీ (2-డియాక్సీ డి-గ్లూకోజ్) అందుబాటులోకి వచ్చింది. ఔషధాన్ని సోమవారం ఢిల్లీలో కేంద్ర రక్షణ, ఆరోగ్యశాఖ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, హర్షవర్ధన్ విడుదల చేశారు.
మొదట రక్షణ మంత్రి డ్రగ్‌ను విడుదల చేసి ఆరోగ్యశాఖ మంత్రికి అందజేయగా డ్రగ్స్‌ను ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియాకు అందజేశారు. పదివేల డోసులను ఢిల్లీలోని పలు ఆసుపత్రులకు పంపిణీ చేయనున్నారు.
పొడి రూపంలో రానున్న ఈ ఔషధాన్ని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో వైరస్ ఉన్న కణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుందని డీఆర్‌డీఓ వివరించింది. కరోనాకు ఇప్పటి వరకు వ్యాక్సిన్లను మాత్రమే ఇస్తున్న సంగతి తెలిసిందే.
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ పౌడర్‌ను డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరి సహకారంతో అభివృద్ధి చేసింది. 2డీజీ డ్రగ్‌ను కరోనా రోగులకు అత్యవసర వినియోగానికి ఇటీవల డీసీజీఐ అనుమతి ఇచ్చింది. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో డీఆర్‌డీఓకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (INMAS) ఈ డ్రగ్‌ను అభివృద్ధి చేసింది.
ఓ మోస్తరు నుంచి తీవ్రమైన కొవిడ్ లక్షణాలున్న వారిలో ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్‌లో తేలిందని డీఆర్‌డీఓ పేర్కొంది. కరోనా బాధితులకు ప్రధాన చికిత్స చేస్తూ అదనంగా ఈ డ్రగ్‌ను ఇస్తే వారు వేగంగా కోలుకునే అవకాశం ఉంటుందని వివరించింది.

More Stories
ఎప్స్టీన్ ఫైల్స్‌తో బ్రిటన్ ప్రధానికి గండం… తొలి ముస్లిం ప్రధాని?
మాజీ ఆర్మీ చీఫ్ పుస్తకంపై విస్తృత ప్రచారం.. కేసు నమోదు
మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో మహాయుతి ఘన విజయం