కేసీఆర్ పై హత్యాయత్నం కేసు నమోదు చేసినా తప్పులేదు

ఆంధ్రప్రదేశ్ అంబులెన్సులను సరిహద్దుల్లో అడ్డుకుంటోందంటూ బీజేపీ నేత విజయశాంతి తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యం కోసం ఏపీ నుంచి హైదరాబాదు వస్తున్న రోగుల అంబులెన్సులను సరిహద్దుల దగ్గర ఆపేసి ఏమాత్రం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఆస్పత్రుల్లో బెడ్ కన్ఫర్మ్ చేసుకున్నా, అందుకు రుజువులు చూపిస్తున్నా అనుమతించకపోవడం దారుణమని మండిపడ్డాయిరు. సరిహద్దుల్లో అంబులెన్సులను ఆపే విషయమై ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయా అన్న హైకోర్టు ప్రశ్నకు కూడా అధికారులు సరైన సమాధానం ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేసారు. 

తెలంగాణ సర్కారు తీరుతో సరిహద్దుల వద్ద పలువురు రోగులు మృత్యుముఖానికి చేరువయ్యే పరిస్థితి నెలకొందని వాపోయారు. ఈ దుస్థితికిగానూ తెలంగాణ ముఖ్యమంత్రిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినా తప్పులేదని విజయశాంతి వ్యాఖ్యానించారు.