ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు అరెస్టు

న‌ర్సాపురం వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును ఏపీ సీఐడీ పోలీసులు శుక్ర‌వారం సాయంత్రం అరెస్టు చేశారు. హైద‌రాబాద్‌లోని ర‌ఘురామ‌కృష్ణ‌రాజు నివాసానికి చేరుకున్న సీఐడీ పోలీసులు ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను ఆయన పుట్టిన రోజుననే అరెస్ట్ చేయడం గమనార్హం. అనంతరం ఆయన్ని మంగళగిరి సీఐడీ కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తున్నది.

ఈ క్ర‌మంలో ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, ఏపీ సీఐడీ పోలీసుల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.  ఆయనపై 124(A) ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు, 153(B) వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, 505 IPC బెదిరింపులకు పాల్పడటం, 120(B) కుట్రపూరిత నేరం సెక్షన్ల కింద సిఐడి కేసు నమోదు చేసింది.

న్ ప్ర‌భుత్వ ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించేలా వ్యాఖ్య‌లు చేశార‌న్న ఆరోప‌ణ‌ల‌తోనే ఆయ‌న‌ను అరెస్టు చేసినట్లు స‌మాచారం.అయితే మొదట్లో వారిని సీఆర్పీఎఫ్ పోలీసులు అడ్డుకున్నారు. తమ ఉన్నతాధికారుల అనుమతి ఉంటేనే అదుపులోకి తీసుకునేందుకు ఒప్పుకుంటామని సీఆర్పీఎఫ్ పోలీసులు తేల్చి చెప్పారు.

 కాగా,  వారెంట్‌ లేకుండా తన తండ్రిని అరెస్ట్‌ చేశారని ఆయన కుమారుడు భరత్ ఆరోపించారు. రఘురామకృష్ణరాజు అరెస్ట్‌కు కారణాలు కూడా చెప్పకుండా.. కోర్టులో చూసుకోండని సీఐడీ అధికారులు అన్నారని భరత్‌ చెప్పారు. రఘురామను ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదని, అధికారం చేతిలో ఉందని ఏమైనా చేస్తారా? అని ప్రశ్నించారు. 

‘‘కరోనా సమయంలో ఒక ఎంపీని ఎలా అరెస్ట్‌ చేస్తారు? రఘురామకు ఆరోగ్యం కూడా బాగాలేదు. ఇదంతా ఓ స్కెచ్. వాళ్లు సీఐడీ ఆఫీసర్‌లో.. రౌడీలో అర్థం కావడం లేదు. రఘురామ అరెస్ట్‌పై కోర్టులో హౌస్‌మోషన్‌ దాఖలు చేస్తాం’’ అని ఆయన తెలిపారు.

3.30కి 30 మంది పోలీసులు వారెంట్ లేకుండా వచ్చి బలవంతంగా లాక్కుని వెళ్లిపోయారని  ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. 4 నెలల క్రితం నాన్నకు బైపాస్ స‌ర్జ‌రీ జరిగిందని..ఓ ఎంపీని 30 మంది పోలీసులు సీఆర్పీఎఫ్ సిబ్బందిని నెట్టేసి తీసుకుపోయారని చెప్పారు. 

గత కొంతకాలంగా ఏపీ సర్కార్‌పై రఘురామ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం జగన్, సజ్జల, వైవీ సుబ్బారెడ్డి తదితరులపై ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ తప్పులను ఎండగడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు రావడం.. అరెస్ట్ చేయడం రాజకీయంగా తీవ్ర దుమారాన్ని లేపుతోంది.

సిబిఐ కేసులలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టులో ఆయన వేసిన పిటిషన్ ప్రస్తుతం పరిశీలనలో ఉంది. 

ఎన్నో ఏళ్లగా వేల మందికి ఉపాధి కల్పిస్తున్న జువారి సిమెంట్, అమరరాజా బ్యాటరీస్ పరిశ్రమలను మూసివేయాలని ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఈ ,అడఁజూర్  ఫిర్యాదు చేశారు. సరైన కారణాలు చూపకుండా పరిశ్రమలు మూసివేయాలనడం రాష్ట్ర ప్రభుత్వ క్రూరమైన చర్యగా అభిప్రాయపడ్డారు. పరిశ్రమలపై ఇలాంటి చర్యలు తీసుకుంటే రాష్ట్రంలోని పరిశ్రమల యాజమాన్యాలు భయపడుతున్నాయని.. జగన్ సర్కార్ తీరును ప్రధానికి వివరించారు.