
తెలంగాణ పోలీసులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. మాజీ కేంద్ర మంత్రి, బిజెపి రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి కార్యలయంకు చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి, గరిమళ్ల వెంకటకృష్ణరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. నాలుగు రోజుల క్రితం కూడా సరిహద్దులో అంబులెన్స్‌లను నిలిపివేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
పిటిషన్‌పై స్పందించి పోలీసులపై హైకోర్టు అగ్రహం వ్యక్తం చేసింది. అంబులెన్స్‌లను ఆపితే కోర్టు ధిక్కరణ కిందకు తీసుకోవాల్సి వస్తుందని అప్పుడే తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు చెప్పింది. అయినప్పటికీ మళ్లీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ- తెలంగాణ సరిహద్దుల్లో పేచీ మళ్లీ మొదటికి వచ్చింది. అంబులెన్స్‌లను ఆపడం మానవత్వమేనా? అంటూ హైకోర్టు అక్షింతలు వేసినప్పటికీ పోలీసుల తీరు మాత్రం మారడం లేదు. తెలంగాణ-ఏపీ బోర్డర్లన్నింటి వద్ద నేడు పోలీసులు అంబులెన్స్‌లను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ పోలీసులు ఏకంగా 20 అంబులెన్సులను అడ్డుకున్నారు. దీంతో సకాలంలో వైద్యం అందక ఒక రోగి మృతి చెందాడు.
హైకోర్టు ఆదేశాలతో రెండు రోజులుగా ఏపీ అంబులెన్స్‌లను అనుమతిస్తున్నారు. అయితే గురువారం రాత్రి తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో పోలీసులు అంబులెన్స్‌లను అడ్డుకుంటున్నారు. అప్పటి నుండి తెలంగాణ సరిహద్దులో ఏపీ అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు నిలిపివేస్తున్నారు.
విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన వినోద అనే వృద్ధురాలు పక్షవాతంతో బాధపడుతోంది. హైదరాబాద్‌లోని చికిత్స పొందేందుకు అనుమతి పత్రం చూపినా తెలంగాణ పోలీసులు అనుమతించలేదు. పరిస్థితి విషమంగా ఉంటే ఇలాంటి కొత్త ఆంక్షలేంటని బాధితురాలి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంబులెన్స్‌లను వెనక్కి పంపడంతో కోవిడ్ పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి లెటర్, కోవిడ్ కంట్రోల్ రూమ్ నుంచి జారీ చేసిన పాస్‌లు ఉంటేనే అనుమతి ఇస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి కోవిడ్–19 వైద్య సేవల కోసం తెలంగాణకు వస్తున్నవారిని అనుమతించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకు రావాలంటే సదరు ఆస్పత్రి అంగీకారం తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. చికిత్స చేసేందుకు సానుకూలంగా ఉన్నట్టుగా ఆస్పత్రితో ముందస్తు ఒప్పందం చేసుకోవాలని పేర్కొంది. అనంతరం పోలీసు శాఖ అనుమతి కోసం కంట్రోల్ రూమ్‌కు వివరాలు సమర్పించి రసీదు తీసుకోవాలని సూచించింది.
More Stories
బనకచర్లపై అందరితో చర్చించాకే నిర్ణయం
బనకచర్లను ఆపేయాలి.. తెలంగాణ ఎంపీలు
కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు