సరిహద్దుల్లో అంబులెన్సుల రవాణాకై సుజనా చొరవ

దేశంలోనే మెడికల్ హబ్ గా పేరొందిన హైదరాబాద్ కు వైద్యం కోసం పొరుగు రాష్ట్రాల నుండి అంబులెన్సు లలో వస్తున్న కోవిద్ రోగులను అర్ధాంతరంగా తెలంగాణ పోలీసులు రాష్ట్ర సరిహద్దులలో ఆపివేస్తే సరిహద్దుల వద్ద కిలోమీటర్ల మేరకు అంబులెన్సులు నిలిచిపోయాయి.
దేశంలో మరెక్కడా లేని విధంగా అంబులెన్సు లను రాష్ట్ర సరిహద్దుల్లో నిలిపివేసి తెలంగాణ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది.
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కు వచ్చే హక్కు ఏపీ వారికి పదేళ్ళపాటు ఉన్నప్పటికీ ఈ విషయమై విచిత్రంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కనీసం నిరసన కూడా తెలపలేదు.
 ప్రతిపక్షాలు ఈ విషయమై విమర్శలు చేసినా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి, ఈ సమస్య పరిష్కారంలో మాజీ కేంద్ర మంత్రి, బిజెపి రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి కృషి చేశారు. ముందుగా తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.  ఫలితం లేదని గ్రహించి తన కంపెనీలో రిటైర్డ్ ఐ ఆర్ ఎస్ అధికారి గరిమెళ్ల వెంకట కృష్ణారావుతో హై కోర్ట్పి లో టిషన్ వేయించారు. బలమైన వాదనలు వినిపించారు. అదే సమయంలో హైకోర్ కూడా సుమోటో గా ఈ అంశాన్ని చేపట్టింది.
ఈ విషయం హైకోర్టుకు చేరడంతో కథ కొత్త మలుపు తిరిగింది. బోర్డర్ల వద్ద అంబులెన్సులు ఆపమని మీకు ఎవరు చెప్పారని అక్షింతలు వేసి, వాటిని అడ్డుకోరాదని ఆదేశించింది. అంతే  దానితో అంబులెన్సుల్లో వచ్చే రోగుల సరిహద్దు సమస్యకు పరిష్కారం లభించింది.తెలంగాణ కోర్టు అదేశంతో పోలీసులు, ప్రభుత్వం వెనక్కి తగ్గాయి. అంబులెన్స్ లు ఆపుతూ తీసుకున్న నిర్ణయాన్నివెనక్కి తీసుకున్నాయి.
కాగా, విజయవాడలోని తన సొంత కల్యాణమండపమయిన వెన్యూ కళ్యాణమండపాన్ని కోవిడ్ సెంటర్‌గా మార్చమని స్వయంగా సుజనా చౌదరి కలెక్టర్‌కు లేఖ రాశారు. సుజనా ఫౌండేషన్ ద్వారా అక్కడ 100 బెడ్లలో కరోనా బాధితులకు చికిత్సలందించే ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఆక్సిజన్, డాక్టర్లు మినహా… రోగులు, డాక్టర్లకు భోజనం, పీపీఈ కిట్లు, మందుల వంటి ఇతర ఖర్చులన్నీ సుజనా ఫౌండేషనే భరించేందుకు ముందుకొచ్చింది.