కోవిడ్ మహమ్మారి ని ఎదుర్కుంటున్న సమాజం

కోవిడ్ మహమ్మారి ని ఎదుర్కుంటున్న సమాజం

‌దేశంలో  రెండో దశలో కరోనా తీవ్ర స్థాయిలో వ్యాపించింది. వైరస్‌ ‌బారిన పడి అనేక మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోగులు ఎక్కువ అవుతుండడంతో దేశంలోని పలు ఆస్పత్రుల్లో వైద్య, ఆరోగ్య సిబ్బంది, పడకల కొరత ప్రధాన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో సమాజం తమ వంతుగా భాద్యతగా భావిస్తూ బాదితులకు వివిధ పద్దతులలో సహాయ సహకారాలు అందిస్తుంది.

వలస కూలీలకు భోజనం

చత్తీస్ఘడ్ రాష్టం నుండి హైదరాబాద్ కు వలస కూలీలు ఉపాధి కోసం వస్తున్న క్రమంలో తెలంగాణ లో లాక్ డౌన్ ఉందని అధికారులు పోనివ్వరని భావించిన బస్సు డ్రైవర్ మహరాష్ట్ర సరిహద్దు బోరజ్ వద్దనే 15 మంది కూలీలను విడిచి పెట్టి వెల్లిపోయాడు. ఇక చేసేదేమి లేక తమ వద్ద ఉన్న డబ్బులు బస్సు ఛార్జీలకె ఖర్చు పెట్టిన వలస కూలీలు హైదరాబాద్ వైపు నడకను ప్రారంభించారు.. అలా నడుచుకుంటూ వెలుతున్న వారిని ఆదిలాబాదు జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రానికి చేరుకున్నారు.. వారిని గమనించిన పాత్రికేయులు నాగుల సతీష్ ( 6TV) వారి వివరాలు ఆరా తీసే క్రమంలో పిల్లలతో సహా పస్తులుండి నడుచుకుంటు వస్తున్నామని వారు చెప్పడం తో వారి పరిస్థితి ని సామాజికవేత్త అయినా గిత్తే మదన్ గారికి తెలియ పర్చడంతో వారు ఏ మాత్రం ఆలోచించకుండ వారికి స్వయంగా వండి భోజనాన్ని అందించారు.

 

నిర్మల్ సేవాసమితి:

కోవిడ్ సమయంలో ఇంటి దగ్గర చికిత్స పొందుతున్న వారికి భోజనం, మందులు అందివ్వడం తో పాటు వివిధ సేవలు అందిస్తున్న నిర్మల్ సేవాసమితి.  కరోనా బారిన పడి ఎవరైనా చనిపోయిన వారికి సైతం దహన సంస్కారాలు చేయడానికి సైతం వీరు సహాయ సహకారాలు అందిస్తున్నారు.

 

మేము సైతం అంటూ హెల్పింగ్ ఫౌండేషన్:

జగిత్యాల జిల్లాలో “మేము సైతం అంటూ హెల్పింగ్ ఫౌండేషన్” అనే స్వచ్చంధ సంస్థ ద్వారా కరోనా బారిన పడి మృతి చెందిన వారికి వారి సంప్రదాయాల ప్రకారం అంత్య క్రియలు చేస్తున్నారు. ఈ బృందంలో అలిసెటి గంగాధర్, పూర్వ ఏబీవీపీ కార్యకర్త, తన వంతు సహకారులు అందిస్తున్నాడు.

 

 

 

 

వాట్సాప్ తో కొవిడ్ సేవలు

మేడ్చల్ జిల్లా దమ్మాయి గూడకు చెందిన కరోనా సేవక్స్ అండ వారియర్స్ అనే వాట్సాప్ గ్రూపు గత 20 రోజులుగా, 20 మందితో మొదలై 190 మందికి చేరుకుంది.ఎంతో మందికి ఉచిత ప్లాస్మా, భోజనం, ఏం.ఆర్.పి  రేట్ కే రెండిసేవేర్, అంఫాసిన్ ఇంజెక్షన్లు, ఉచితంగా ఆక్సీజన్ సిలిండర్ లు అందించడం జరిగింది.

కరోనా నుండి కొలుకున్నవారి ఇంటిని సానిటైజ్ చేయించడం. పేదవారికి అంతిమ సంస్కారాలకు ఆర్థిక సహాయం సైతం అందించడం జరిగింది.

ఈ గ్రూప్ స్థానికంగా ఉన్న బీజేపీ నేతలు, కార్యకర్తలు, ఆరెస్సెస్ స్వయంసేవకులు, అఖిల భారత విద్యార్థి పరిషత్ కార్యకర్తలు మొదలు పెట్టగా, క్రమక్రమంగా ప్రచారం పొంది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. ప్రస్తుతం ఈ గ్రూప్ వివిద సంస్థలకు చెందిన సామాజిక కార్యకర్తలు, పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు సభ్యులుగా చేరి తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు.

 

నాగరకర్నూల్ జిల్లా ముచర్లపల్లి గ్రామంలో కరోనా తో మృతి చెందిన రామస్వామి గౌడ్ గారి అంత్యక్రియలు ఆరెస్సెస్ స్వయం సేవకులు రమేష్, చెన్నయ్య, హరీష్ కలిసి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది.

 

సికింద్రాబాద్ విభాగ్ సేవాభారతి, VHP ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం మేడ్చల్ ఖండ లో జరిగినది బజరంగ్ దళ్ RSS వివిధ సంస్థల ఆధ్వర్యంలో జరిగినది ఈ కార్యక్రమంలో 60 మంది రక్తదానం ఇవ్వడం జరిగినది.

 

చేర్యాల సేవ భారతి వారు కోవిడ్ సమయంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు

Cherial Seva Bharathi Trust Helps Home Isolation Patients | సేవా భారతి సంస్థ | Mana Vaarthalu