తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని ఫోన్

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని ఫోన్
దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. కరోనా సోకి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. మరోవైపు ఆక్సిజన్, టీకాల కొరత తీవ్రంగా ఏర్పడుతోంది. దీంతో రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని మోదీ దృష్టి సారించారు. వివిధ రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ మాట్లాడారు. 

కోవిడ్ పరిస్థితులపై తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్,  ఒడిశా, జార్ఖండ్ ముఖ్యమంత్రులతోనూ మోదీ చర్చించారు. పుదుచ్చేరి, జమ్మూకశ్మీర్ గవర్నర్లతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మాట్లాడారు.

ఏపీ సీఎం జగన్‌తోనూ ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. కరోనా ఉధృతి, తీసుకుంటున్న చర్యలను జగన్‌ను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రధానికి జగన్‌ వివరించారు. వైద్యరంగంలో మౌలిక సదుపాయాలు పెంచామని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. 

రాష్ట్రానికి కావాల్సిన వాక్సిన్లు ఆక్సీజన్ రెమిడిసివర్ సరఫరా గురించి ప్రధాని నరేంద్రమోడితో ప్రవించిన కేసీఆర్  తక్షణమే రాష్ట్రానికి సమకూర్చాల్సిందిగా అభ్యర్థించారు. తమిళనాడులోని శ్రీ పెరంబదూరు నుంచి కర్నాటకలోని బల్లారి నుంచి రాష్ట్రానికి కేటాయించిన ఆక్సీజన్ అందడంలేదని ప్రధాని ద్రుష్టికి తెచ్చారు.  

మెడికల్ హబ్ గా హైదరాబాద్ మారినందును సరిహద్దు రాష్ట్రాల ప్రజలు కూడా హైద్రాబాద్ మీదనే వైద్యసేవలకు ఆధారపడుతున్నారని తెలిపారు. మహారాష్ట్ర, చత్తీస్ గడ్, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ తదితర రాష్ట్రాలనుంచి హైద్రాబాద్ కు కోవిడ్ చికిత్సకోసం చేరుకోవడం వలన హైద్రాబాద్ మీద భారం పెరిగిపోయిందని సిఎం వివరించారు. 

తెలంగాణ జనాభాకు అధనంగా 50 శాతం కరోనా పేషెంట్లు ఇతర రాష్ట్రాలనుంచి రావడం వలన హైద్రాబాద్ మీద ఆక్సీజన్ వాక్సీన్ రెమిడిసివర్ మంటి మందుల లభ్యతమీద పడుతున్నదని ప్రధానికి సిఎం తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రస్థుతం రోజుకు 440 మెట్రిక్ టన్నుల ఆక్సీజన్ మాత్రమే రాష్ట్రానికి అందుతోందని దాన్ని 500 మెట్రిక్ టన్నుల కుపెంచాల్సిందిగా ప్రధానిని కోరారు.

 రోజుకు తెలంగాణలో కేవలం 4900 రెమిడిసివర్లు మాత్రమే అందుతున్నాయని వాటిని రోజుకు కనీసం 25000 కు పెంచాలని కోరారు. ఇప్పటి వరకు కేంద్రం 50 లక్షల డోసులను అందచేసిందని కానీ రాష్ట్ర అవసరాల ద్రుష్ట్యా అవసరం మరింతగా వున్నదని కోరారు. రాష్ట్రానికి వాక్సీన్లు ప్రతిరోజుకు 2 నుంచి2.5 లక్షల డోసులు అవసరం పడుతున్నదని వాటిని సత్వరమే సరఫరాచేయాలని ప్రధాని మోడీని సిఎం కెసిఆర్ విజ్జప్తి చేశారు.

కాగా….సిఎం కెసిఆర్ విజ్జప్తి మేరకు.. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు  కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ సిఎం కేసీఆర్ తో మాట్లాడారు. ప్రధాని కెసిఆర్ విన్నవించిన అంశాలన్నింటిని సత్వరమే రాష్ట్రానికి సమాకూరుస్తామని, ఆక్సీజన్ వాక్సీన్ రెమిడిసివర్ సత్వర సరఫరాకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ సిఎం కు హామీ ఇచ్చారు. ఆక్సీజన్ ను కర్నాటక తమిళనాడులనుంచి కాకుండా తూర్పు రాష్ట్రాలనుంచి సరఫరా జరిగేలా చూస్తామన్నారు.