టీకా జాతీయవాదం వద్దు… టెక్నాలజీని పంచుకోవాలి

కరోనా అంతం కోసం అన్ని దేశాలు తాము అభివృద్ధి చేసిన కరోనా టీకా తయారీ సాంకేతికతను ప్రపంచంతో పంచుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పిలుపిచ్చారు. మహమ్మారిపై పోరులో టీకా జాతీయవాదానికి చోటు లేదని ఆమె స్పష్టం చేశారు. సోమవారం ఆమె ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) వార్షిక సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా కొవిడ్ వ్యాక్సీన్‌పై సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవాలని ఆమె దేశాలను కోరారు. వ్యాక్సీన్‌కు జాతీయవాదం ఉండదని అన్నారు. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ట్రిప్స్ (మేధోసంపత్తి హక్కుల కోణానికి సంబంధించిన వాణిజ్యం) ఒప్పందం గురించి ఆమె మాట్లాడుతూ  వ్యాక్సిన్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకునేందుకు దేశాలంతా ఏకమవ్వాలని సూచించారు. 

వ్యాక్సీన్ జాతీయవాదం ఉండదని, దీనిపై దేశాలు సానుకూల వైఖరిని చూపాలని ఆమె పేర్కొన్నారు. ఈ ట్రిప్స్ డబ్లుటిఒ (ప్రపంచ వాణిజ్య సంస్థ) సభ్య దేశాలన్నింటి మధ్య చట్టబద్ధమైన ఒప్పందం. కొవిడ్ మహమ్మారితో పోరాటం చేసేందుకు అంతర్జాతీయ ప్రపంచ వ్యాప్తంగా సంస్థల అవసరం ఉందని తెలిపారు