20 ఏళ్ళ తర్వాత తమిళనాట బీజేపీ ఎమ్యెల్యేలు 

2001 ఎన్నికలలో నలుగురు ఎమ్యెల్యేలను గెలుచుకున్న బీజేపీ ఆ తర్వాత జరిగిన మూడు ఎన్నికలలో కూడా ఒక్క ఎమ్యెల్యేని కూడా గెలిపించుకోలేక పోయింది. ఎన్డీయే ఓటమి చెందినా నలుగురు ఎమ్యెల్యేలను గెలిపించుకోవడం ద్వారా తమిళ నాడు రాజకీయాలలో బీజేపీ ఒక శక్తిగా ఎదిగే అవకాశం ఏర్పడింది. 

వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. అయితే, ఈ నలుగురు అభ్యర్థులు తమతమ ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీని ఎదుర్కొని విజయతీరాలకు చేరారు. అదీకూడా అతి స్వల్ప ఓట్ల మెజార్టీతోనే గెలుపొందారు. అంతకు ముందు తొలిసారిగా 1996లో బిజెపి నుండి ఒక ఎమ్యెల్యే ఎన్నికయ్యారు. 

సి సరస్వతి మొదకురిచి నుండి, ఎం ఆర్ గాంధీ  నాగర్కోయిల్ నుండి, వాసంతి శ్రీనివాసన్ కోయంబత్తూర్ సౌత్ నుండి, నైనర్ నాగేంద్రం తిరునెల్వేలి నుండి గెలుపొందారు. వీరంతా ఇప్పుడు అసెంబ్లీలో బిజెపి ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. వీరిలో బిజెపి మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వాసంతి శ్రీనివాసన్ కోయింబత్తుర్ సౌత్ లో కమల్ హాసన్ ను ఓడించారు.

ఈ నలుగురు అభ్యర్థులు తలపడిన ప్రత్యర్థుల వివరాలను పరిశీలిస్తే, ఈరోడ్‌ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందిన డాక్టర్‌ సరస్వతి కేవలం 281 ఓట్ల మెజార్టీలో విజయాన్ని అందుకున్నారు. ఈమె డీఎంకే సీనియర్‌ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి సుబ్బులక్ష్మి జగదీశన్‌ను ఓడించారు. అదేవిధంగా కోయంబత్తూరు దక్షిణం స్థానం నుంచి బరిలోకి దిగిన బీజేపీ మహిళా నేత వానతి శ్రీనివాసన్‌ సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ను 1728 ఓట్ల తేడాతో చిత్తు చేసి గెలుపుగుర్రాన్ని అందుకున్నారు.

తిరునెల్వేలి స్థానంలో డీఎంకే సీనియర్‌ నేతగా ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే లక్ష్మణన్‌ను బీజేపీ అభ్యర్థి నయినార్‌ నాగేంద్రన్‌ 500 ఓట్ల తేడాతో ఓడించారు. చివరగా, నాగర్‌కోయిల్‌ స్థానంలో డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి సురేష్‌ రాజన్‌ను బీజేపీ అభ్యర్థి ఎంఆర్‌ గాంధీ 11689 ఓట్ల తేడాతో చిత్తు చేశారు. మూడేళ్ళ క్రితం మక్కల్ నీధి మైమ్ పార్టీని ప్రారంభించిన కమల్ హస్సన్ తన పార్టీ నుండి ఒక్కరిని కూడా గెలిపించుకోలేక పోగా, చివరకు తాను కూడా బిజెపి అభ్యర్థి చేతిలో ఓటమి చెందవలసి వచ్చింది.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ మురుగన్ ధర్మపురంలో కేవలం 812 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. “తమిళనాడులో బిజెపి ఉనికికి అవకాశంలేదని ప్రత్యర్ధులు ప్రచారం  చేస్తున్న సమయంలో 2020 ప్రారంభంలో రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన తాను రాష్ట్రంలో బిజెపి పతాకం ఎగరవేస్తానని శబధం పునాను” అని ఈ సందర్భంగా మురుగన్ గుర్తు చేశారు. తమిళనాట బిజెపి మరింతగా బలం పుంజుకొంటుందని ఎన్నికైన నలుగురు ఎమ్యెల్యేలు చాటుతూ ఉంటారని చెప్పారు.