ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలకు అనుమతి ఇచ్చింది.
ఆ తర్వాత కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. రెండు వారాల పాటు ఈ కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉండనున్నాయి. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. నిన్న ఒక్కరోజే 23,997 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో.. కరోనా ఉధృతిని తగ్గించేందుకు పగటి కర్ఫ్యూ అమలుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

More Stories
రూ. 50 కోట్లతో ఏపీ ఎన్నార్టీ కార్పస్ ఫండ్
అరాచకాలకు పాల్పడిన వారికి శిక్ష తప్పదు
మార్చి నెలాఖరు నుండి టిటిడి ఆలయాలలో అన్నప్రసాద వితరణ