రాష్ట్రాల‌కు 16.37 కోట్ల ఉచిత వ్యాక్సిన్‌

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్ప‌టివ‌ర‌కు 16.37 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ఉచితంగా ఇచ్చామని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రాలు మరో 17 లక్షల డోసులు అందుకోనున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ‌ శనివారం వెల్ల‌డించింది.

ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా మూడో దశ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైందని, ఈ దశలో దేశ యువత వ్యాక్సినేషన్‌కు అర్హులని ప్ర‌క‌టించారు. రాష్ట్రాల్లో తమతమ జనాభాకు వ్యాక్సిన్‌లు వేసేందుకు ఇప్ప‌టికీ 79 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య‌శాఖ‌ వివరించింది.

రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు ఇచ్చిన మొత్తం 16.37 కోట్ల ఉచిత వ్యాక్సిన్ డోసులలో వృథా అయిన వాటితో కలుపుకొని మొత్తం 15,58,48,782 డోసులు వినియోగమ‌య్యాయ‌ని

కాగా, గరిష్ట సంఖ్యంలో వ్యాక్సిన్లు అందుకున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందు వరుసలో ఉండగా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. లక్షద్వీప్‌లో వ్యాక్సిన్ వేస్టేజీ 9.76 శాతంగా ఉండగా, తమిళనాడులో 8.83 శాతం, అసోంలో 7.70 శాతం, మణిపూర్‌లో 7.44 శాతం, హర్యానాలో 5.72 శాతం వేస్టేజీ ఉంది.