![బెంగాల్ లో ఘనవిజయం దిశగా బీజేపీ! బెంగాల్ లో ఘనవిజయం దిశగా బీజేపీ!](https://nijamtoday.com/wp-content/uploads/2021/04/Mamata-Modi.jpg)
ప్రముఖ హిందీ టీవీ ఛానల్ ఇండియా టీవీ తో కలసి పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో పశ్చిమ బెంగాల్ లో బీజేపీ పార్టీ ఘనవిజయం సాధించే అవకాశం కనిపిస్తున్నది. ఆ పార్టీకి 172 నుండి 192 , త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీకి 64 నుండి 88 , లెఫ్ట్ ఫ్రంట్ 7 నుండి 12 సీట్స్ గెలుపొందే అవకాశం వుందని వెల్లడించింది.
ఇండియా టీవీ – పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేను సంస్థ డైరెక్టర్ డాక్టర్ సజ్జన్ కుమార్ నిర్వహించారు. బెంగాల్ ఎన్నికలలో బీజేపీ పార్టీ విజయానికి ప్రధాన కారణం ప్రజలు హిందూ , ముస్లిం సామాజికి వర్గాలుగా విడిపోవడం తో పాటు స్థానిక త్రిణమూల్ నాయకుల అవినీతి , అక్రమాలు , రౌడీయిజం ప్రధాన కారణం అని పేరొన్నారు.
నందిగ్రామ్ నుండి బరిలో నిలిచిన మమతా బెనెర్జీ ఆ నియోజకవర్గంనుండి ఓడిపొయ్యే అవకాశాలు అధికముగా వున్నాయని తెలిపారు.
బెంగాల్ రాష్ట్రంలో పీపుల్స్ పల్స్ సంస్థ దాదాపు మూడు సార్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు పర్యటించి సర్వే నిర్వహించింది .
బెంగాల్ రాష్ట్రంలో ఎవరితో మాట్లాడిన రాష్ట్ర రాజకీయాల్లో పరివర్తన వస్తుంది అన్ని స్పష్టంగా చేశారని వెళ్ళైద్నచింది. గాల్ రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని స్పష్టమైన్నట్లు తెలిపింది. 2019 పార్లమెంట్ ఎన్నికలలోనే బెంగాల్ ప్రజలు మార్పు దిశగా , బీజేపీ పార్టీ వైపు అడుగులు వేయడం ప్రారింభించారని గుర్తు చేశారు.
ఎనిమిది దశల పాటు కొనసాగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మార్చి 27న ప్రారంభమైన ఈ పోలింగ్, ఏప్రిల్ 29న జరిగిన చివరి దశ పోలింగ్‌తో ముగిసింది. కాగా దేశంలో జరిగిన ఎన్నికల్లో సుదీర్ఘంగా కొనసాగిన అసెంబ్లీ ఎన్నికలు ఇవేనని అంటున్నారు. గతంలో బెంగాల్‌లో ఏడు దశల్లో ఎన్నికలు జరిగినప్పటికీ ఈసారి ఎన్నికల్లో మరో దశను పెంచి ఎనిమిది దశలకు పెంచి నిర్వహించారు.
బెంగాల్‌తో పాటు మరో మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినప్పటికీ అందరి చూపూ బెంగాల్‌వైపే ఉంది. బెంగాల్‌లో బీజేపీ అనూహ్యంగా దూసుకురావడం ఒకటైతే అమిత్ షా ప్రత్యేకంగా బెంగాల్‌ను ఎంచుకొని కొంత కాలంగా అక్కడే ఉంటూ కమల పార్టీని గెలిపించే ప్రయత్నాలు చేశారు. దీంతో సహజంగానే చాలా మంది బెంగాల్ వైపు చూడడం ప్రారంభించారు.
ఇక రిపబ్లిక్-సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం.. తృణమూల్‌కు 126-136, బీజేపీ, మిత్రపక్షాలకు 138-148 సీట్లు రానున్నాయి.
అస్సాంలో బీజేపీదే అధికారం అని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఎన్డీటీవీ ప్రకారం మొత్తం 126 స్థానాల్లో బీజేపీకి 76 స్థానాలు రానున్నాయి. అటు ఇండియా టుడే కూడా బీజేపీకి 75-85 స్థానాలు రానున్నట్లు అంచనా వేసింది. ఆజ్‌తక్-యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీకి 75-85 మధ్య స్థానాలు వస్తాయని చెబుతోంది.
కేరళలో మరోసారి లెఫ్ట్ కూటమికే ప్రజలు పట్టం కట్టనున్నట్లు ఎన్డీటీవీ, ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇండియా టుడే ప్రకారం.. కేరళలో మొత్తం 140 స్థానాలకు గాను ఎల్డీఎఫ్ కూటమికి 104-120 స్థానాలు రానున్నాయి. అదే ఎన్డీటీవీ మాత్రం ఎల్డీఎఫ్‌కు 76 స్థానాలు వస్తాయని అంచనా వేసింది.
ఇక తమిళనాడు విషయానికి వస్తే అన్ని ఎగ్జిట్ పోల్స్ డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమని తేల్చేశాయి. రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం 234 స్థానాలు ఉన్న తమిళనాడులో డీఎంకేకు 160-170 స్థానాలు రానుండగా.. అన్నాడీఎంకే 58-68 స్థానాలకు పరిమితం కానుంది. అటు ఎన్డీటీవీ కూడా అన్నాడీఎంకేకు 58 స్థానాలకు మించి రావని తేల్చేసింది.
More Stories
రాహుల్ అజ్ఞానం వెల్లడిస్తున్న మోహన్ భగవత్‌పై వ్యాఖ్యలు
వాయుసేన అమ్ములపొదిలోకి మరో మూడు యుద్ధ నౌకలు
బంగ్లాదేశ్ లో కంగనా ‘ఎమర్జెన్సీ’ పై నిషేధం