తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తి ఛానెల్ ఎస్వీబీసీలో పోర్న్ వీడియో రగడ కొనసాగుతోంది. ఇటువంటి నేరాలకు సంబంధించి మరో ఇద్దరు ఉద్యోగుల మీద వేటు పడింది. ఇప్పటికే ఇందుకు సంబంధించి 10 మంది మీద టీటీడీ చర్యలు తీసుకొన్నది.
ఎస్వీబీసీ ఛానల్‌లో ప్రసారమయ్యే శతమానం భవతి కార్యక్రమ వివరాల కోసం వెంకటకృష్ణ అనే భక్తుడు గతేడాది నవంబరులో ఛానల్‌కు మెయిల్ చేశారు. ఆ కార్యక్రమ వివరాలు బదులు నీలి చిత్రాలకు సంబంధించిన పోర్న్ సైట్ లింక్ పంపించారు. దీంతో గత ఏడాది నవంబరు 6న టీటీడీ ఈవోకు సదరు భక్తుడు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేయాలని విజిలెన్స్ అధికారులను టీటీడీ ఈవోఆదేశించారు. కాగా, విజిలెన్స్ నివేదిక ఆధారంగా అప్పట్లోనే ఆరుగురు ఉద్యోగులను ఎస్వీబీసీ ఉన్నతాధికారులు తొలగించింది. మరో ముగ్గురు ముఖ్య అధికారుల పాత్రపై విచారణ జరిపించి, పక్కన పెట్టేశారు.
ఇదే క్రమంలో ఎస్వీబీసీలో మేనేజర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు ఆఫీస్ కంప్యూటర్‌లో కూడా కొన్ని అసభ్యకర వీడియోలు, ఫొటోలతో పాటు సినిమాలున్నట్టు తేలటంతో వేటు వేశారు. అటు, వీడియో ఎడిటర్ మిట్టపల్లి రవికిరణ్ ఇటీవల ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా వ్యవహారంలో పట్టుబడ్డాడు. పోలీసుల నివేదిక ఆధారంగా అతన్ని కూడా ఎస్వీబీసీ నుంచి తొలగించారు.
More Stories
హర్యానాలో వరుసగా మూడోసారి బీజేపీ అద్భుత విజయం
జమ్ముకశ్మీర్ తదుపరి సీఎంగా ఒమర్ అబ్దుల్లా
పోలవరంకు కేంద్రం రూ.2,800 కోట్లు విడుదల