
అంతేకాకుండా తెలంగాణ కాంగ్రెస్ నేతలను కూడా విజయశాంతి విమర్శించారు. కేసీఆర్, జానారెడ్డిలు తోడు దొంగలని, వారు మంచి మిత్రులనే విషయాన్ని గుర్తుచేశారు. ఒప్పందం ప్రకారమే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతిని సరైన సమయంలో ప్రజల ముందు ఉంచుతామని విజయశాంతి ప్రకటించారు.
హాలియాలో జరిగిన ప్రచార సభలో సీఎం పోడు భూముల సమస్యలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని ఆమె గుర్తు చేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల తలకాయలు చావు నోట్లో ఉన్నాయని విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అంబేడ్కర్ జయంతికి కనీసం నివాళులర్పించలేని పరిస్థితిలో సీఎం కేసీఆర్ ఉన్నారని ఆమె విమర్శించారు. అంతేకాకుండా, సీఎం కేసీఆర్ దొంగ నిరాహార దీక్ష వలన తెలంగాణ రాలేదని ఆమె స్పష్టం చేశారు. ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు ఆపేస్తామని టీఆర్ఎస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు.
More Stories
బనకచర్లపై అందరితో చర్చించాకే నిర్ణయం
బనకచర్లను ఆపేయాలి.. తెలంగాణ ఎంపీలు
కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు