దేశ విభజన కారణమైన ఖిలాఫత్ ఉద్యమం

డా అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని సెంటర్ ఫోర్ సౌత్ ఇండియన్ స్టడీస్ (సిఎస్ఐఎస్)  సంస్థ ఆద్వర్యంలో సంవిత్  ప్రకాష్ వారు ప్రచురించిన “ఖిలాఫత్ , ముస్లిం వేర్పాటువాదం- దేశ విభజన” అనే పుస్తక చర్చతో పాటు దేశ విభజన పై అంబేడ్కర్ గారి అభిప్రాయం అనే అంశాలపై సమీక్ష అనే కార్యక్రమం ఆల్వాల్, సికందరాబాద్ లో 14 ఏప్రిల్ నాడు  జరిగింది.

శ్రీ రంగ్ గోడ్బోలే గారు రాసిన పుస్తకం “ఖిలాఫత్ , ముస్లిం వేర్పాటువాదం- దేశ విభజన” గురుంచి శ్రీ సురేందర్ , సిఎస్ఐఎస్ సభ్యులు మాట్లాడుతూ, అఖండ భారత్ చరిత్రలో 1947 లో జరిగిన దేశ విభజన అనేది అత్యంత విషాద ఘటన అని, అందుకు గల కారణాలను రచయిత చాలా వివరంగా విశ్లేషిస్తూ ఒక పరిశోధానాత్మక దృస్టి తో రాసిన పుస్తకం అన్నారు.

దేశ విభజనకు కారణమైన ఇస్లామిక్ శక్తులు, భారతీయ ముస్లిం లకు ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష  సంబందం లేని టర్కీ పరిణామాలకు మద్దతు అంటూ  1920 లో ఖిలాఫత్ ఉద్యమ్యాన్ని ఒక  తమను అనుకూలంగా మార్చొకొని   1947 లో పాకిస్తాన్ ను ఏర్పాటు చేయడం.  1920 నుండి 1940 వరకు స్థానిక ముస్లింలలో ఒక మతోన్మాదాన్ని ప్రేరేపించడం, హిందూ వ్యతిరేకత ఆలోచనలకు పురికొల్పడం, ఇస్లామేతర వ్యక్తుల సంస్థల పట్ల అపనమ్మకాన్ని కల్గించిన విధానాన్ని రచయత ఈ పుస్తకం లో పేర్కొన్నారు.

128 పేజీలతో ఉన్న ఈ పుస్తకం ఖిలాఫత్ గురించి ఇప్పుడు తెలుసుకోవలసిన అవసరం, దానికి ఆధారమైన మత గ్రంథం, ఉద్యమానికి ముందు వందేళ్లలో జరిగిన పరిణామాలు, ఈ ఉద్యమానికి పునాదులు వేసిన వారు ఎవరు, దీని వలన భారతీయ ముస్లింలలో వచ్చిన మార్పు, బ్రిటిష్ వారు ఈ ఉద్యమానికి ఇచ్చిన అండదండల గురుంచి వివరించారు. దాంతో పాటు ఖిలాఫత్ ఉద్యమాన్ని కేంద్రంగా చేసుకొని ముస్లింలు రాజకీయంగా, సామాజికంగా హిందువులపై చేసిన బెదిరింపులు,  దాడులు, మలబార్ ప్రాంతంలో  జిహాద్ అంటూ హిందువుల ఊచకోత, విచ్చల విడిగా మత మార్పిడి, స్త్రీ ల పై చేసిన అత్యాచారాలు, వాటిని పకడ్బందీగా సమర్దించిన విధానాన్ని  ఈ పుస్తకంలో సాక్షాలతో సహ వివరించారు.

సిఎస్ఐఎస్ సభ్యులు శ్రీ అయూష్ గారు మాట్లాడుతూ ప్రత్యేకంగా భారతదేశంలోని ముస్లింలు 1857 యుద్ధం తరువాత నుండి 1940 వరకు ఒక సామాజిక రాజకీయ శక్తి గా ఎదగడానికి చేసిన ప్రయత్నం, దాంతో పాటు, ముస్లిం లీగ్, జమాయత్ ఉల్ ఉలామా-ఈ-హింద్ స్థాపన,  దియోబంద్ సంస్థల ఏర్పాటు,  తద్వారా మొత్తం ముస్లిం సమాజాన్ని ప్రభావం చేయడం. అప్పటి కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రభావం చేసి, ముస్లిం అనుకూలంగా ఉండేటట్టు చేయడం జరిగిన తీరు ఈ పుస్తకంలో పుస్తకంలో వివరించడం జరిగింది అని పేర్కొన్నారు. దాంతో పాటు  1905 లో బ్రిటిష్ తలపెట్టిన బెంగాల్ విభజన అడ్డుకున్న సమాజం, దేశ విభజన ను అదే స్థాయిలో ప్రతిగతించడంలో విఫలం అయ్యింది అని, దానికి ప్రధాన కారణం ముస్లిం రాజకీయ నాయకులలో వచ్చిన మార్పు తో పాటు, హిందూవులలో ఈ విభజన పట్ల జరిగే పరిణామాలను అర్ధం చేసుకోవడంలో జరిగిన తప్పిదం అని పేర్కొన్నారు.

సిఎస్ఐఎస్ చేస్తున్న పని గురుంచి శ్రీ సహదేవ్ గారు వివరించారు. ఈ కార్యక్రంలో పాల్గొన్న సభ్యులు ఈ పుస్తకం గురుంచి మరిన్ని వివరాలు అడిగి తెలుసోకొవడం జరిగింది.  దాంతో పాటు సామాజికంగా ఇప్పటి సమాజం విభజన శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి, దేశ అస్తిత్వాన్ని దెబ్బ దీసే ప్రయత్నాలు, శక్తుల పట్ల జాగృత సమాజాన్ని నిర్మాణ చేయాలని సమావేశంలో పాల్గొన్న వారు కోరడం జరిగింది.

ఈ పుస్తకం ఆన్ లైన్ లో లబ్యమవుతుంది.

https://www.hindueshop.com/product/khilafat-desh-vibhajana-tel/