హిందూ రాష్ట్రంగా ప్రకటించి భారత్ ను కాపాడండి 

దేశంలో లవ్ జిహాద్ జరుగుతూ ఉండడం నిజమే. పైగా ముస్లింలు భారత్ ను ఒక ముస్లిం దేశంగా చేయాలని చూస్తున్నారు…. ఈ మాటలు అన్నది ఎవ్వరో ఆర్ ఎస్ ఎస్, బిజెపి నేతలు కాదు. కేరళ శాసనసభ్యుడు ఒకరు స్పష్టం చేశారు. పైగా, భారత్ ను హిందూ రాష్ట్రంగా ప్రకటించడమే అందుకు పరిష్కారమని కూడా వెల్లడించారు. 

లవ్ జిహాద్ వాస్తవమని, ముస్లింలు భారతదేశాన్ని ముస్లిమ్ దేశంగా తయారు చేయాలని యోచిస్తున్నారని కేరళ ఎమ్మెల్యే పీసీ జార్జ్ ఆరోపించారు. ముస్లింలు క్రైస్తవ దేశాల్లోకి కూడా చొరబడి వాటిని ఇస్లామిక్ దేశాలుగా చేస్తున్నారని జార్జ్ పేర్కొన్నారు.

గిరిజనుల సంక్షేమం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ హెచ్ ఆర్ డి ఎస్ ఇండియా సమావేశంలో మాట్లాడుతూ  2030నాటికి ముస్లింలు ఇస్లామిక్ దేశంగా మార్చాలని కేరళలోని ముస్లింలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

వారి ఎత్తుగడలను తిప్పి కొట్టడం కోసం భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని పీసీ జార్జ్ డిమాండ్ చేశారు. నోట్ల రద్దు కారణంగా భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలనే ప్రణాళిక ఆలస్యమైందని జార్జ్ చెప్పారు. పూంజార్ నుండి ఏడుసార్లు ఎమ్యెల్యేగా ఎన్నికైన జార్జ్ (69) కేరళ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న రెండు ప్రధాన కూటములు కూడా తమ స్వార్ధ ప్రయోజనాలకోసం భారత్ ను ఇస్లామిక్ దేశంగా మార్చే  ఉగ్రవాద శక్తులతో చేతులు కలుపుతున్నాయని ఆరోపణ చేశారు.

‘‘ముస్లింలు ఫ్రాన్స్ లోకి చొరబడ్డారు, ఇప్పుడు వారు దాన్ని ముస్లిం దేశం మార్చాలని చూస్తున్నారు’’ అని జార్జ్ చెప్పారు. లవ్ జిహాద్ లేదని సుప్రీంకోర్టు చెప్పిందని, కాని లవ్ జిహాద్ నిజమని తాను చెబుతున్నానని ఎమ్మెల్యే జార్జ్ స్పష్టం చేశారు. దేశం మొత్తం మీద కేరళలో లవ్ జిహాద్ ఎక్కువగా ప్రబలినదని పేర్కొన్నారు.

లౌకిక, సామ్యవాద దేశంగా రాజ్యాంగం ప్రకటించుకున్న చోట ఇటువంటి దుర్మార్గాలు జరగడం మనందరికీ సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ప్రజలు అపార్థం చేసుకోకుండా దీనికి ముగింపు పలకడానికి భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని పీసీ జార్జ్ డిమాండ్ చేశారు. ప్రపంచంలోని ఇతర దేశాలను చూసి గుణపాఠం నేర్చుకోవాలని ఆయన హితవు చెప్పారు.

ఒకొక్క దేశాలలో ఒకొక్క మతం ప్రముఖంగా ఉన్నదని, అయితే అరేబియా దేశాలు తమ మతాన్ని ప్రచారం చేసుకోవడమే కాకుండా ఇతర మతాల ఉనికిని కూడా సహింపలేని స్థితిలో ఉన్నాయని ఆయన హెచ్చరించారు.

ఈ దేశం ఓ వ‌ర్గం చేతుల్లోకి వెళ్లాల‌ని అనుకుంటున్నామా? దీనిపై చ‌ర్చ జ‌ర‌గాలి. ఎవ‌రో ఒక‌రు దీనిపై మాట్లాడాలని జార్జ్ కోరారు. ఇది ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్తుంది?అని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రమాదం నుండి భారత్ ను కాపాడాలి అంటే భారత్ ను హిందూ రాష్ట్రంగా ప్రకటించగడం ఒక్కటే మార్గం అని జార్జ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ముస్లింల ఆగడాలను కట్టడి చేయడంలో అమెరికా కూడా విఫలం అవుతున్నట్లు విమర్శించారు.