పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ లక్ష్యంగా మరోసారి విమర్శలు గుప్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. దీదీ ఓ దీదీ అంటూ మరోసారి ఆమెను హేళన చేసిన మోదీ.. నందిగ్రామ్‌లో క్లీన్‌బౌల్డయ్యారని స్పష్టం చేశారు.
ఆమె బౌల్డవడంతో మొత్తం టీమ్‌ను ఫీల్డ్ నుంచి బయటకు వెళ్లిపోవాల్సిందిగా అడిగారని మోదీ ఎద్దేవా చేశారు. ఇదే సందర్భంలో తృణమూల్ నినాదమైన మా, మాటి, మనుష్‌పై కూడా సెటైర్లు వేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ లక్ష్యంగా మరోసారి విమర్శలు గుప్పించారు ప్రధాని నరేంద్ర మోదీ.
క్రికెట్ పరిభాషలో మాట్లాడుతూ ఇప్పటికే తొలి నాలుగు విడతల ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు ఎన్నో బౌండరీలు బాదారని, బీజేపీ సెంచరీ పూర్తి చేసేసిందని మోదీ భరోసా వ్యక్తం చేశారు. సగం మ్యాచ్‌లోనే తృణమూల్‌ను లేకుండా చేసేశారని చెప్పారు. దీదీని నందిగ్రామ్‌లో క్లీన్‌బౌల్డ్ చేసి ఆమె మొత్తం టీమ్‌ను ఫీల్డ్ నుంచి వెళ్లిపోవాలని చెప్పారని అన్నారు.
‘దీదీ ఓ దీదీ’, మీ కోపానంతా కక్కేయాలనుకుంటే… నేను ఇక్కడే ఉన్నా… మీ ఇష్టమొచ్చినట్లు నన్ను తిట్టుకోండి. అయితే బెంగాలీ సంస్కృతి, సంప్రదాయాన్ని కాదు. మీ అహంకారాన్ని, దోపిడీని, మనీ సిండికేట్‌ను బెంగాల్ ఇక సహించదు. ఎందుకంటే ప్రజలు అసలైన మార్పు కోరుకుంటున్నారు’ అంటూ వ్యాఖ్యానించారు. ఓటమి భయంతోనే దీదీలో అసహనం, కోపం పెరిగిందని ప్రధాని ధ్వజమెత్తారు. పశ్చిమ బెంగాల్‌లో టిఎంసి నినాదమై ‘మా, మాతి, మనుష్’ను దీదీ మరచిపోయి మోడీ, మోడీ, మోడీ అని జపం చేస్తున్నారని చురకలంటించారు.
మాను అంటే హింసించడం, మాటి అంటే మాతృభూమిని దోచుకోవడం, మనుష్ అంటే మనుషుల మధ్య రక్తపాతం సృష్టించడమే ఆమెకు తెలుసునని మండిపడ్డారు. మమతా బెనర్జీ తన పాలనలో పశ్చిమ బెంగాల్‌ను అభివృద్ధి చేయకుండా గందరగోళ వాతావరణం సృష్టించారని విరుచుకపడ్డారు.
కేంద్ర బలగాలపైకి ప్రజలను రెచ్చగొట్టి పంపించే ప్రయత్నం మమతా బెనర్జీ చేశారని మోదీ ఆరోపించారు. ఈసారి మమతా ఓడిపోయిన తర్వాత మళ్లీ అధికారంలోకి ఎన్నటికీ రాదని ఆయన స్పష్టం చేశారు. క్రికెట్ పరిభాషలో మాట్లాడుతూ ఇప్పటికే తొలి నాలుగు విడతల ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు ఎన్నో బౌండరీలు బాదారని, బీజేపీ సెంచరీ పూర్తి చేసేసిందని మోదీ ప్రకటించారు. సగం మ్యాచ్‌లోనే తృణమూల్‌ను లేకుండా చేసేశారని చెప్పారు.
దీదీని నందిగ్రామ్‌లో క్లీన్‌బౌల్డ్ చేసి ఆమె మొత్తం టీమ్‌ను ఫీల్డ్ నుంచి వెళ్లిపోవాలని చెప్పారని స్పష్టం చేశారు. కేంద్ర బలగాలపైకి ప్రజలను రెచ్చగొట్టి పంపించే ప్రయత్నం మమతా బెనర్జీ చేశారని మోదీ ఆరోపించారు. ఈసారి మమతా ఓడిపోయిన తర్వాత మళ్లీ అధికారంలోకి ఎన్నటికీ రాదని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులపై దీదీ బహిరంగ యుద్ధం ప్రకటించారని ఆక్షేపించారు. తనపైనే కాకుండా, బెంగాల్‌లోని ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ వర్గాలకు చెందిన తన సోదర సోదరీమణులపై దీదీ యుద్ధం ప్రకటించారని నార్త్ 24 పరగణాల జిల్లాల్లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ మోదీ అన్నారు.
ఎన్నికల్లో హింస గురించి మోదీ ప్రస్తావిస్తూ, ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని కనీసం ఒక్క ఎన్నికల ర్యాలీలోనైనా మమత పిలుపునిచ్చారా అని ప్రశ్నించారు. హింసకు పాల్పడే వారు, ఓటింగ్‌ను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మాటమాత్రంగానైనా మమత చెప్పారా అని ఆయన నిలదీశారు.
More Stories
తుది దశకు చేరుకున్న వామపక్ష తీవ్రవాదం
దుర్గామాతపై గర్భా గీతం రాసిన ప్రధాని మోదీ
ఇజ్రాయెల్- హమాస్ మధ్య పోరుకు ఏడాది పూర్తి