ఎన్ఆర్సీ అమల్లోకి వస్తే ఒక్క గోర్ఖాను కూడా జాబితా నుంచి తొలగించకుండా చూస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా భరోసా ఇచ్చారు. పశ్చిమ బెంగాల్‌లోని కలింపాంగ్‌లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఎన్‌ఆర్‌సీ వస్తే గోర్ఖాలను జాబితా నుంచి తొలగించేస్తారంటూ తప్పుడు సమాచారం ప్రచారం జరుగుతోందని విమర్శించారు.
ఎన్నార్సీ అమలు చేయడం వల్ల గూర్ఖాలకు ఇబ్బందులు తలెత్తుతాయని అధికార తృణమూల్ లేనిపోని ప్రచారం చేస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నంత వరకూ గూర్ఖాలకు ఎలాంటి ప్రమాదమూ లేదని భరోసా ఇచ్చారు. ‘‘ఇప్పటి వరకైతే ఎన్నార్సీని అమలు చేయలేదు. చేసే సమయంలో ఏ గూర్ఖాని కూడా దేశం విడిచి వెళ్లమని ఆదేశించం. ఈ విషయంలో తృణమూల్ అసత్యాన్ని ప్రచారం చేస్తోంది. వారిలో భయాన్ని పెంచుతోంది’’ అంటూ షా విరుచుకుపడ్డారు.
ఎన్ఆర్‌సీని ఇప్పటి వరకూ తీసుకు రాలేదని, ఒకవేళ తీసుకువచ్చినా ఒక్క గోర్ఖాను కూడా జాబితా నుంచి తొలగించేది లేదని చెప్పారు. ఒక్కరు కూడా ఎన్ఆర్‌సీ వల్ల బాధితులు కారని ఆయన హామీ ఇచ్చారు. ‘కలింపాంగ్ ఎళ్ల తరబడి బాధలు పడుతూనే ఉంది. 1986లో ఇక్కడి ప్రజలను సీపీఎం అణిచివేసింది. 1,200 మందికి పైగా గోర్ఖాలు ప్రాణాలు కోల్పాయారు. మీకు న్యాయం జరగలేదు’ అంటూ విచారం వ్యక్తం చేశారు.
దీదీ వచ్చి పలువురు గోర్ఖాల ఉసురు తీసుకున్నారని మండిపడ్డారు. ‘అప్పుడూ మీకు న్యాయం జరగలేదు. కమలాన్ని (బీజేపీ) ఎన్నుకోండి. “సిట్” ఏర్పాటు చేస్తాం, వాళ్లను కటకటాల వెనక్కి పంపుతాం’ అని అమిత్‌షా చెప్పారు. ఎన్నికల ప్రచారంలో సీఎం మమత బెంగాల్ కంటే తన పేరునే ఎక్కువ సార్లు ప్రస్తావిస్తూ ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
కేంద్ర హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని పదే పదే డిమాండ్లు చేస్తున్నారని, బెంగాల్ ప్రజలు చెబితే తప్పకుండా రాజీనామా చేస్తానని పునరుద్ఘాటించారు. అయితే ముఖ్యమంత్రి పదవికి మే 2 న రాజీనామా చేసేందుకు మాత్రం దీదీ సిద్ధంగా ఉండాలని కౌంటర్ ఇచ్చారు. అనవసరంగా, అసందర్భంగా సీఎం మమత బీజేపీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
దీనికి ముందు, కలింపాంగ్‌లో అమిత్‌షా రోడ్‌షో నిర్వహించారు. వేలాది మంది కార్యకర్తలు పార్టీ జెండాలతో ర్యాలీలో పాల్గొన్నారు. నార్త్ బెంగాల్ సంస్కృతికి అనుగుణంగా అమిత్‌షా సాంప్రదాయ గోర్ఖా టోపీ, మఫ్లర్ ధరించి రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈనెల 17న జరుగనున్న 5వ విడత పోలింగ్‌లో కలింపాంగ్ నియోజకవర్గం కూడా ఉంది.
More Stories
కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసు దోషికి జీవిత ఖైదు
భారత్ బలం అద్భుతమైన ఐక్యతలోనే ఉంది
రాహుల్ గాంధీపై గౌహతిలో కేసు