దుబ్బాకకు తిరుపతికీగల పోలికలు  

డా. వడ్డీ విజయసారధి, 
ప్రముఖ సామజిక, రాజకీయ విశ్లేషకులు   
దుబ్బాకలో భాజపా గెలుస్తుందని నేను చెప్ప మొదలిడినపుడు అది అసాధ్యమంటూ   సన్నిహితులు నన్ను హెచ్చరించారు. దుబ్బాకకు తిరుపతికీగల పోలికలు మనవి చేస్తాను. ఆలోచించండి. మీ చూపులు వంగి, మీ మూపులు క్రుంగి, మీరు ప్రశ్నార్థకాల(?)వలె కన్పించడానికి కారణం మీ మెదళ్ళలో ఉన్న బానిస భావాల బరువు. దాన్ని వదిలించు కోండి, ఆశ్చర్యార్థకాలై నిలుస్తారు!
చుట్టూఉన్న గజ్వెల్, సిద్ధిపేట, సిరిసిల్లలను అభివృద్ధి చేసిన రాష్ట్ర ప్రభుత్వం దుబ్బాకను నిర్లక్ష్యం చేసిందనే ఆక్రోశం ప్రజల్లో ఉంది. తిరుపతి పవిత్రతకు భంగం వాటిల్లు తున్నదనే ఆక్రోశమిక్కడ! బీజేపీ ఎప్పటికీ గెలువదు అనుకున్న కాంగ్రెసు కంచుకోట మెదకును 1999లో ఏలే నరేంద్ర గెలిచి చూపించారు. డా౹౹ఎన్. వెంకటస్వామి తిరుపతి నుండి బిజెపి అభ్యర్థిగా ఎన్నికైనారు. 
ఇప్పటికి ఒక విషయం స్పష్టమైంది. తెదేపాకు ఘనమైన గతముందేమో కాని, భవిష్యత్తు ఏమీ కనబడటంలేదు. పరిషత్ ఎన్నికలలోనైనా, తిరుపతి ఉప ఎన్నికలోనైనా!  “మనవాళ్లుత్త వెధవాయిలోయ్” అనేమాట వదిలిపెట్టితేనే మార్పుకు శ్రీ కారం చుట్టగలము. నిద్రించే సింహాలను మేల్కొలుప గలము. వారిద్వారా దేశాన్ని, ధర్మాన్ని రక్షించుకోగలము. 
మిమ్ములను ఆశ్చర్యంలో ముంచెత్తే ఫలితాలను ఇవ్వబోతున్న కేరళ, పుదుచ్చేరి. దేశానికి మేలుచేకూర్చే ఫలితాలు రావాలని మీరూ ఆకాంక్షించండి. 2019కి ఇప్పటికీ తేడా ఏమి టంటే.. ఎన్నికల తర్వాత వచ్చేది న.మో. ప్రభుత్వం కాదని ఆంధ్ర ప్రదేశ్వో టర్లు నమ్మారు. జగన్ పార్టీకి 22 మంది ఎం.పీ.ల నిచ్చినా వారివల్ల ఏమీ కాదని ఇప్పుడర్థమైంది.
నాదృష్టిలో పెద్ద దివాళాకోరు లెవరంటే…చంద్రబాబు మాటల్లో తప్పుపట్టుకుంటే, జగన్ను భుజాన వేసుకొన్నట్లు, జగన్ చేతలలో తప్పుపట్తే చంద్రబాబు పక్షాన చేరినట్లు ఊహించే వారు.  క్రమక్రమంగా స్వీయకృషి ఆధారంగా విస్తరిస్తూ దేశాన్ని  కాంగ్రెస్ కబంధహస్తాల నుండి విడిపించిన  భాజపాను నిరాదరించటం తగదని ఆం.ప్ర. ప్రజానీకం గ్రహిస్తున్నారు.
కొద్దిపాటి తేడాలతో తెదేపా, వైఎస్సార్సీపీ లు ఒకే రకం పార్టీలు. అవి ఒకదాని కొకటి ప్రత్యామ్నాయం కాజాలవు. భాజపాయే ఈ రెండింటికీ నిజమైన ప్రత్యామ్నాయం.  తెలుగువాళ్లం కేంద్రంలో భాజపా ప్రభుత్వం దేవుడు వ్రాసిచ్చిన కానుక అనుకొంటున్నాం. దానిని నిలబెట్టుకొనడానికి మనమూ దోహదంచేయాలన్న ఆలోచన లేకపోతే ఇబ్బందులలో పడతాం.  దుబ్బాక ఎంతమార్పుతెచ్చిందో తెలియదా? తిరుపతి, కన్యాకుమారి గెలిస్తే, దక్షిణాది రాజకీయాలపై ఆ ప్రభావాన్ని ఊహించలేరా?  మరి కదలరేమి? చరైవేతి చరైవేతి! 
‘రాజకీయాలలో ఒక వారం అంటే  సుదీర్ఘ వ్యవధి’ అనేది పాత మాట. ఎప్పటికప్పుడు స్పందించటమే ఇప్పటి రీతి. మీ మౌనాన్ని తపస్సు అనుకోరు. లాలూచీ పడ్డారు నని సందేహిస్తారు. కేరళలో, ప.బెంగాల్లో ఎరుపు, ఆకుపచ్చ జెండాల స్థానంలో కాషాయవర్ణం పైనున్న జెండా ఎగరేస్తున్నారు? తిరుపతిలో కాషాయ పతాకకు కాక మరొకరికి అవకాశమిస్తారా? 
 “జీనా హైతో మరనాసీఖో, కదం కదం పర్ లడనా సీఖో” అసంలో ప. బెంగాల్లో, కేరళలో, పుదుచ్చేరి తమిళనాడుల్లో  ఏమిసాధించారో మే 2న ప్రదర్శిస్తారు. తెలుగువారూ దీటుగా ప్రదర్శించుకోగలరా?  తమిళనాడులో కన్యాకుమారి నుండి, ఆం.ప్ర.లో తిరుపతి నుండి లోకసభకు ఉపఎన్నికలు. రెండూ గతంలో భాజపా గెలిచిన స్థానాలే. ఎంతటి  సువర్ణావకాశ మిది! నడుం బిగించండి. 
 అప్పుచేసి పప్పుకూడు ఎన్నాళ్లుంటుంది? ఈ ప్రశ్న వేసికోనివాడు తాను మునగటమే గాక, తనను నమ్ముకున్న వాళ్లనూ ముంచుతాడు. బ్రేకు వేయటం తప్పనిసరి. మోమోటమి వద్దు.  తిరుపతి ఉపఎన్నిక ఎంత పెద్ద అవకాశమో! 17తర్వాత  ఎంత మాట్లాడినా ఒరిగేది ఏమీ ఉండదు. మీ అభిప్రాయాలు ఇప్పుడే చెప్పండి. వాలుగాలి వీచేటట్లు చేయండి.