రామసేతును జాతీయ కట్టడంగా ప్రకటించాలి 

రామసేతును జాతీయ కట్టడంగా ప్రకటించాలని నరేంద్ర మోదీ విశ్వహిందూ పరిషద్ డిమాండ్ చేసింది హరిద్వార్ లో  జరిగిన కేంద్రీయ మార్గదర్శక మండలి సమావేశంలో సమావేశంలో దేశం నలుమూలల నుండి సాధువులు, పీఠాధిపతులు పాల్గొన్న సమావేశంలో ఈ డిమాండ్ చేశారు. 

శ్రీ  రాముడు రామేశ్వరం నుండి శ్రీలంక వరకు `నిర్మించిన `రామసేతు’ ను జాతీయ కట్టడంగా ప్రకటించాలని స్పష్టము చేశారు. అదే  దేశంలోని అన్ని మందిరాలను ప్రభుత్వం నుండి విముక్తి కల్పించాలని పిలుపిచ్చారు. దేశం ఐక్యత, అఖండతలకు ప్రమాదం తెచ్చే పెట్టె  మతమార్పిడిలను, సామజిక విద్వేషాలను పెంపొందించే విషయాల పట్ల సరైన పరిష్కారం చూపడం అవసరమని సమావేశం భావించింది. 

పలని కార్తికేయ స్వామి ఆలయం విషయంలో భక్తుల ద్వారా ట్రస్ట్ ఏర్పర్చి పూజ, అర్చన, ఆలయ నిర్వహణ జరపాలని మద్రాస్ హై కోర్ట్ తీసుకున్న నిర్ణయం సముచితం అంటూ సమావేశం ఆహ్వానించింది. అదే విధంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ద్వారా కాశి విశ్వనాధ మందిరం పరిశ్రమలలో కాశి విశ్వనాధ మందిరం పరిసరాలలోని భూమిని పరిశీలించి, తవ్వకాలు జరపాలని ఆదేశాలు ఇవ్వడంను కూడా మార్గదర్శక మండలి స్వాగతించింది. 

మరోవంక, ఉత్తరాఖండ్‌ సీఎం తిరత్‌ సింగ్‌ రావత్‌ 51 ఆలయాలపై ప్రభుత్వ అజమాయిషీని తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌, యమునోత్రి, గంగోత్రి సహా పలు ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ దిశగా గత ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ తీసుకున్న నిర్ణయాన్ని నూతన సీఎం తిరగదోడారు.

చార్‌ధామ్‌ దేవస్ధానం బోర్డు ఏర్పాటు నిర్ణయాన్ని సమీక్షిస్తామని, 51కిపైగా ప్రముఖ ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం ఉండబోదని సీఎం రావత్‌ స్పష్టం చేశారు. ఆలయాలపై ప్రభుత్వ అజమాయిషీ, ప్రముఖ గుడులను ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవడంపై నిరసనలు వ్యక్తమవడంతో తాజా నిర్ణయం తీసుకున్నారు.

ఈ నిర్ణయంతో ఆయా ఆలయాలు సమర్ధంగా నిర్వహించేలా ప్రొఫెషనల్‌ మేనేజ్‌మెంట్‌లోకి వెళ్లేందుకు వెసులుబాటు లభించిందని సీఎం రావత్‌ పేర్కొన్నారు.