కరోనా వైరస్ మరోమారు విజృంభిస్తుండటంతో అన్నిరాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పాక్షిక లాక్డౌన్ కొనసాగుతున్నది. పాఠశాలలు, పార్కులు, బీచ్‌లు, మాల్స్‌ను మూసివేశారు. భారీగా భక్తుల రద్దీ ఉండే దేవాలయాలపైనా ఈ ప్రభావం పడింది.
ఒడిశాలోని పూరీ జగన్నాథస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు కరోనా నెగిటివ్ (ఆర్టీ-పీసీఆర్) రిపోర్టును ఆ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
తాజాగా ఏపీలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 12 నుంచి శ్రీవారి సర్వదర్శనం నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11 వరకే సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. సోమవారం నుంచి సర్వదర్శనం టోకెన్లు నిలిపివేస్తామని ప్రకటించింది.
రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు మాత్రమే కొనసాగుతాయని స్పష్టం చేసింది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని కోరింది. ఆలయానికి వచ్చే భక్తులు విధిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేసింది. సోమవారం నుంచి జారీని నిలిపివేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. తదుపరి టోకెన్లు జారీ ఎప్పుడనేది ముందుగానే తెలియజేస్తామని తెలిపింది.

More Stories
కర్ణాటకలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నసీర్ రాయచోటిలో అరెస్ట్
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏకసభ్య కమిటీ
వైసిపి ఎమ్మెల్సీతో పోలీసులు కుమ్మక్కు.. సుప్రీం ఆగ్రహం