రిషికేష్ కుటుంబానికి పోలీసులు సుమారు 50 సార్లు ఫోన్ చేసినా, కాల్స్‌కు సమాధానం ఇవ్వలేదు. దీంతో గుడివాడ పోలీసుల ద్వారా రిషికేష్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా, ఆ గదిలోని గోడలపై రక్తంతో ఇంగ్లీషు, ఇతర భాషలలో రాసిన సందేశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ సందేశాన్ని అర్థంచేసుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇంగ్లీషులో ఉన్న ఒక్క లైన్ ‘‘నేను పోలీసులకు ఫోన్ చేయలేకపోతున్నాను’’ అని స్పష్టంగా ఉంది. గది తలుపులు లోపలి నుంచి వేసి ఉండటంతో పోలీసులు దీనిని తొలుత రిషికేశ్ ఆత్మహత్యకి పాల్పడ్డారేమోనని భావించినప్పటికీ, మృతదేహంపై ఉన్న కత్తిపోట్లు, గాయాలు చూస్తుంటే ఇది పక్కా ప్రణాళికతో జరిగిన హత్యేనని స్థానికులు అనుమానిస్తున్నారు.
మృతదేహంపై మెడ, చేతుల భాగంలో కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గదిలోని సామాన్లు కూడా ఎక్కడికక్కడా చెల్లాచెదురుగా పడి ఉండటం, టీవీ కూడా కింద పడి ఉండడం చూస్తుంటే అక్కడ తీవ్రస్థాయిలో పెనుగులాట జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

More Stories
ఆంధ్రజ్యోతి జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి దారుణ హత్య
విశాఖలో ‘గూగుల్ ఏఐ డేటా సెంటర్’కు శంకుస్థాపన
ఆంధ్రా యూనివర్సిటీ గ్లోబల్ యూనివర్సిటీగా ఎదగాలి