ముస్లిం మ‌ద్ద‌తు ఓట‌ర్ల‌ను కోల్పోయిన దీదీ 

బెంగాల్‌లో ముస్లిం మ‌ద్ద‌తు ఓట‌ర్ల‌ను దీదీ కోల్పోయింద‌ని ప్ర‌ధాని మోదీస్పష్టం చేశారు. ఇవాళ కూచ్ బెహ‌ర్‌లో జ‌రిగిన బ‌హిరంగ‌స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ  ముస్లిం ఓట‌ర్లు ఐక్యంగా ఉండాల‌ని, ఓట్ల‌ను డివైడ్ చేయ‌వ‌ద్దు అంటూ ఇటీవ‌ల బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ అనడాన్ని ఎద్దేవా చేశారు. 

ఆ వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావించిన ప్ర‌ధాని మోదీ అంటే దీదీ ముస్లింల మ‌ద్ద‌తు కోల్పోతుంద‌ని అర్థ‌మ‌వుతోందని పేర్కొ‌న్నారు. ముస్లింల ఓటు బ్యాంకును కోల్పోవ‌డం వ‌ల్లే దీదీ అలా అభ్య‌ర్థ‌న చేసింద‌ని ధ్వజమెత్తారు. అభివృద్ధి రూపంలో బెంగాలీ ప్ర‌జ‌ల‌కు త‌న ప్రేమ‌ను చూపిస్తానని ప్రధాని భరోసా ఇచ్చారు. 

బంగాల్ జ‌నాభాలో 27 శాతం ముస్లిం ఓట్లు ఉన్నాయి. టీఎంసీ విజ‌యంలో ముస్లిం ఓట్లే కీల‌కంగా మార‌నున్నాయి. అయితే ఆ ఓట్ల కోసం ఇప్పుడు కొత్తగా ఎంఐఎం పోటీప‌డుతున్న‌ది. దీదీ.. మీరు ఎన్నిక‌ల సంఘం ప‌ట్ల అనుచితంగా మాట్లాడుతున్నార‌ని, ఒక‌వేళ మేం హిందువులంతా ఏక‌మై.. బీజేపీకి ఓట్లు వేయాల‌ని కోరితే, మాకు ఇప్ప‌టికే ఎన్నిక‌ల సంఘం నుంచి ప‌ది నోటీసులు వ‌అన్నారు.చ్చేవ‌ని, యావ‌త్ దేశ‌మంతా మాపై ఎడిటోరియ‌ల్స్ రాసేవ‌ని మోదీ దుయ్యబట్టారు.

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓటమి ఖాయమని ఆమెకు ముందే అర్థమైందనీ.. ఆ నైరశ్యంతోనే తనపై ఆమె విద్వేషం వెళ్లగక్కుతున్నారని ప్రధాని ఆరోపించారు. హౌరాలోని దుముర్జాలాలో ఇవాళ జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొంటూ  ఎన్నికల ఫలితాలు వెలువడే మే 2న టీఎంసీ ఓటమి తప్పదనీ స్పష్టం చేశారు. 

ఆ తర్వాత ఆ పార్టీ కనుమరుగువుతుందని ప్రజలు ఇప్పటికి చెప్పుకుంటున్నారని ప్రధాని తెలిపారు. టీఎంసీ పాలనలో ‘‘సులభతర దోపిడి, లూటీ’’లను సంస్థాగతం చేశారంటూ ప్రధాని దుయ్యబట్టారు. అయితే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే  ప్రజలకు ‘‘ప్రశాంతమై జీవితం, సులభతర వ్యాపారాలను’’ అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.