
విమానాశ్రయాల్లో ప్రయాణికులు మాస్కులను ధరించకపోతే అక్కడికక్కడే జరిమానా విధించాలని ఎయిర్‌పోర్టుల అధికారులను డీజీసీఏ ఆదేశించింది. ఇందుకోసం పోలీసుల సహకారాన్ని తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు అన్ని విమానాశ్రయాలకు మంగళవారం సర్క్యులర్‌ను పంపించింది.
ప్రయాణికులు మాస్కులు ధరించేలా, భౌతిక దూరం కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. మాస్కులపై ఈ నెల 13నే డీజీసీఏ నిబంధనలు సక్రమంగా అమలు కాకపోవడంతో తాజా సర్క్యులర్ జారీచేసింది. ఇప్పటికే విమాన ప్రయాణికులకు ఇప్పటికే మాస్క్ నిబంధనలు అమలులో ఉన్న విషయం తెలిసిందే.
కరోనా నేపథ్యంలో ప్రయాణికులు మాస్క్ పెట్టుకోకున్నా, సరిగా ధరించకపోయినా అలాంటి ప్రయాణికులను విమానం నుంచి దించేయాలని ఇప్పటికే ఆదేశాలు అమలులో ఉన్నాయి. ఇప్పడు తాజాగా విమానాశ్రయ ఆపరేటర్లకు డీజీసీఏ కొత్త ఆదేశాలు జారీ చేసింది. విమానాశ్రయ పరిసరి ప్రదేశాల్లో ఎవరైనా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే వారి వద్ద జరిమానా వసూల్ చేయాలని ఆదేశించింది.
మాస్క్‌ను ధరిస్తున్న వారు తమ మూతిని, ముక్కును కవర్ చేసే విధంగా పెట్టుకోవాలి. అసంపూర్ణంగా మాస్క్‌ను ధరించినా జరిమానా తప్పదు. కోవిడ్ ఆంక్షలను పటిష్టంగా అమలు చేయాలంటే ఈ శిక్షలు తప్పవని డీజీసీఏ ఓ ప్రకటనలో అభిప్రాయపడింది. మాస్క్‌లు పెట్టుకోమని ఎవరైనా ప్రయాణికుడు మొండికేసినా వారిని పోలీసులకు అప్పగించాలని గతంలోనే డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవల కొన్ని విమానాశ్రయాలపై నిఘా పెట్టామని, అక్కడ నిర్లక్ష్యం ఉన్నట్లు గ్రహించామని, అందుకే కోవిడ్ నిబంధనలు ఉల్లఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విమానాశ్రయ ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు డీజీసీఏ చెప్పింది. ఇప్పటికే కొన్ని ఎయిన్‌లైన్స్ సంస్థలు మాస్క్‌లు ధరించని ప్రయాణికులపై ఫైన్‌లు వసూల్ చేశాయి.
గత వారం 15 మంది స్వదేశీ ప్రయాణికులపై నిషేధం కూడా విధించారు. డీజీసీఏ రూల్ ప్రకారం ఈ 15 మంది మూడు నెలల పాటు విమానా ప్రయాణానికి దూరం కానున్నారు. దీంట్లో ముగ్గుర్ని ముందే దించేయగా, మరో 12 మందిని ల్యాండింగ్ సమయంలో పోలీసులకు అప్పగించారు. ఇండిగో సంస్థ 9 మంది ప్రయాణికులపై చర్యలు తీసుకున్నది.
More Stories
రూ.3 వేల కొత్త ఫాస్టాగ్ తో ఏడాదంతా ప్రయాణం
మాదకద్రవ్యాలపై యుద్ధంలో పంజాబ్ లో 17,484 మంది అరెస్ట్
పశ్చిమాసియా సంక్షోభంతో పెరుగుతున్న ముడి చమురు ధరలు