
* ప్యూపిల్స్ పల్స్ సౌజన్యంతో
పశ్చిమ బెంగాల్ మొత్తం మీద మైనారిటీలు ఆధిపత్య సంఖ్యలో ఉన్న సీట్లలో తప్పా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రాబల్యం పెద్దగా కనిపించడం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. మైనారిటీల ప్రాబల్యం గల సీట్లలో సహితం అత్యధికంగా టిఎంసి గెల్చుకోగలిగినా, బిజెపి, వామపక్షాలు సహితం ధీటుగా సీట్లు గెలుచుకోగలవని భావిస్తున్నారు. కాంగ్రెస్ ఉనికి మాత్రం కనబడటం లేదు.
ఏడు లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో గల 49 అసెంబ్లీ నియోజకవర్గాలలో మైనార్టీలు నిర్ణయాత్మక శక్తితో ఉన్నారు. ఆ లోక్ సభ నియోజకవర్గాలు: రాయిగంజ్, బాలురఘాట్. మాల్డాహ ఉత్తర్, మాల్డాహ దక్షిణ, జంగిపూర్, బరంపూర్, ముర్షిదాబాద్. దక్షిణ దీనజపూర్ మినహ ఈ ప్రాంతంలోని మిగిలిన అన్ని చోట్ల మైనారిటీలు అత్యధికంగా ఉన్నారు.
దక్షిణ దీనజపూర్ లో మైనారిటీలు 24.6 శాతం మాత్రమే ఉండగా, ఉత్తర దీనజపూర్, మాల్డాలలో 49.9 శాతంగా ఉండగా, ముర్షిదాబాద్ లో 66.3 శాతంగా ఉన్నారు. ఇక హిందువులలో షెడ్యూల్డ్ కులాల వారు మైనారిటీల తర్వాత ఎక్కువగా ఉన్నారు.
ఉత్తర దీనజపూర్, దక్షిణ దీనజపూర్ జిల్లాతో పాటు మాల్దాలోని కొన్ని ప్రాంతాలలో రాజబంశిలు ఎక్కువగా ఉన్నారు. దక్షిణ మాల్డా, ముషీరాబాద్ జిల్లాల్లో షెడ్యూల్డ్ కులాల్లో నమోశూద్రాలు, చైన్ మండల్ దళితులు ఎక్కువగా ఉన్నారు. దక్షిణ దీనజపూర్, ఉత్తర మాల్డా లలో సంథాల్, ముండా వంటి షెడ్యూల్డ్ తెగలవారు గణనీయంగా ఉన్నారు.
ముస్లింలు రాజకీయంగా ఆధిపత్యం వహిస్తుండగా, తమను ఎవ్వరు పట్టించుకోవడం లేదనే భావం ఎస్సీలు, ఎస్టీలలో ఉంది. అందుచేత వారంతా తృణమూల్ కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. తాము వెనుకబడి ఉండడానికి ముస్లింల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న తృణమూల్ నాయకత్వమే కారణం అనే భావనతో వారంతా ఇప్పుడు బిజెపి వైపు తిరిగిన్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది.
కాబట్టి బెంగాల్ లో ప్రభుత్వ వ్యతిరేకత హిందుత్వ రాజకీయాలకు ప్రాణం పోస్తున్నది. బెంగాల్ రాజకీయాలలో హిందూ భావన మొన్నటి వరకు నామమాత్రంగా ఉంటూ వస్తుండగా, ఇప్పుడు ఒకేసారి ప్రబలమైన రాజకీయ శక్తిగా మారడానికి వివిధ కారణాల చేత వివిధ వర్గాల ప్రజలలో నాటుకు పోయిన ప్రభుత్వ వ్యతిరేకతయే కారణం అని చెప్పవచ్చు.
ముస్లింల ఆధిపత్యం గల 49 నియోజకవర్గాలలో టిఎంసి 17 సునాయాణంగా గెలుస్తుందని ప్యూపిల్స్ పల్స్ అంచనా వేయగా, బిజెపి 10, లెఫ్ట్ 11 సీట్లు గెలుస్తుందని తెలిపింది. మరో 11 సీట్లలో తీవ్రమైన పోటీ నెలకొంది. టిఎంసి – బిజెపి మధ్య 4, సీఎంసీ – లెఫ్ట్ మధ్య 4, టిఎయంసి- బిజెపి – లెఫ్ట్ మధ్య 2, బిజెపి – లెఫ్ట్ మధ్య 1 సీట్ లలో తీవ్రమైన పోటీ నెలకొన్నట్లు అంచనా వేస్తున్నారు.
ఇతర పార్టీలతో పోల్చితే సంస్థాగతంగా టిఎంసి ఇక్కడ బలంగా ఉంది. 2016లో గణనీయంగా సీట్లు గెల్చుకున్న లెఫ్ట్ ఫ్రంట్ ఈ సారి చాలా సీట్లు కోల్పోవచ్చని భావిస్తున్నారు. బిజెపి ఎదుగుదలను మమతా మాత్రమే అడ్డుకోగలరనే భావనతో ముస్లింలు అందరు ఇప్పుడు ఆమె వైపు మొగ్గు చూపుతూ ఉండడమే అందుకు కారణంగా చెబుతున్నారు.
సాధారణ, ఓబిసి హిందువులు మద్దతు విషయంలో ఒకొక్క ప్రాంతంలో ఒకొక్క విధంగా వ్యవహరిస్తున్నారు. దీనజపూర్, మాల్డా ప్రాంతాలలో వారిలో అత్యధికులు బిజెపికి మద్దతు ఇస్తుండగా, ముషీరాబాద్ జిల్లాలోని బరంపూర్ లోక్ సభ సీట్లో వారిలో గణనీయ సంఖ్యలో ఇప్పటికి కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారు.
ఇప్పటి వరకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య చీలి ఉన్న మైనారిటీలు ఇప్పుడు మొత్తంగా తృణమూల్ కు మద్దతు ఇస్తున్నారు. ఈ ప్రాంతంలో ముస్లింలు, దళితులు, ఆదివాసీయులు అత్యధికంగా ఉండడంతో మొత్తం మీద బాగా వెనుకబడి ఉంది. దానితో ప్రభుత్వ పథకాలలో తీవ్రమైన అవినీతి కూడా నెలకొంది. కొన్ని రాజకీయ కుటుంబాలు ఆధిపత్యం వహిస్తున్నాయి.
More Stories
విమాన మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం
రైతులను నట్టేట ముంచిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం
వివాహేతర బంధాలతో జీవిత భాగస్వాములనే వేటు!