ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి శాంతిభద్రతల సంబంధిత సంఘటనల్లో కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లో ఒక్క పౌరుడు కూడా చనిపోలేదని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉగ్రవాద ఘటనలు కూడా తగ్గిపోయాయని వెల్లడించింది.
కాల్పుల సంఘటనల్లో మరణించిన పౌరుల కుటుంబాలకు రూ.లక్ష పరిహారం చెల్లిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపారు.
‘ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తరువాత జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద సంఘటనల సంఖ్య గణనీయంగా తగ్గిపోయాయి. 2019, 2020, 2021 (మార్చి 15వరకు) లలో జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద సంఘటనల సంఖ్య వరుసగా 594, 244, 21 గాఉన్నాయి’ అని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
2019 తో పోలిస్తే 2020 లో ఐపీసీ నేరాలలో 16.86 శాతం క్షీణత ఉందని చెప్పారు. 2021 మొదటి రెండు నెలలు కూడా గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12.82 శాతం క్షీణించాయని తెలిపారు.
2019 డిసెంబర్ 31 నాటికి దేశంలోని అన్ని జైళ్ల సామర్థ్యం 4,03,739 కాగా.. వారిలో 4,78,600 మంది ఖైదీలు ఉన్నారని.. వీరిలో 3,30,487 మంది అండర్ ట్రయల్ ఖైదీలు ఉన్నారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
More Stories
గణతంత్ర వేడుకలకు అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు
అన్ని మెగాసిటీల్లో కెల్లా ముంబయి సురక్షితమైనది
ఇస్రో మరో ఘనత.. స్పేడెక్స్ డాకింగ్ విజయవంతం