ఈ ప్రాంతంలో ఆరు లోక్‌సభ సీట్లు ఉన్నాయి: పురులియా, బంకురా, బిష్ణుపూర్, మెడినిపూర్, జార్గ్రామ్, ఘటల్. పశ్చిమ మిడ్నపూర్ లో బెంగాలీ హిందువులు రాజకీయంగా ఆధిపత్యం వహిస్తుండగా, గణనీయ ఆదివాసీయులు, మహతో-కుర్మీలు, షెడ్యూల్డ్ కులాల వారు, ముఖ్యంగా బాగ్డేలు, బౌరిలు ఉన్నారు. ఖరగపూర్ లో హిందూ భాషీలు, తెలుగు ప్రజలు కూడా తగినంత సంఖ్యలో ఉన్నారు. అక్కడక్కడా ముస్లింలు కూడా కొద్దీ సంఖ్యలో ఉన్నారు.
ఝార్గ్రామ్, పురూలియా ప్రాంతంలో మహతో కూర్మిలు తమ విలక్షణమైన సామజిక, రాజకీయ గుర్తింపుతో రాజకీయంగా ఆధిపత్యం వహిస్తున్నారు. వారి తర్వాత ఆదివాసీయులు, ప్రధానంగా శాంతల్స్, షెడ్యూల్ కులంలో ప్రధానంగా బౌరిస్, బాగ్డిస్, బెంగాలీ హిందువులు తమ ఉనికిని చాటుకొంటున్నారు. ముస్లింలు చాల తక్కువగా ఉన్నారు.
అదేవిధంగా, బంకురా, బిష్ణుపూర్ వద్ద షెడ్యూల్డ్ కులాలలో బౌరిస్, బాగ్దీలు, బెంగాలీ హిందువులు దాదాపు సమానంగా ఉన్నారు. వారు కాకుండా సంతల్ తెగల ప్రజలు కూడా గణనీయ సంఖ్యలో ఉన్నారు.
క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న ప్యూపిల్స్ పల్స్ జంగల్ మహల్ ప్రాంతంలో గల మొత్తం 42 అసెంబ్లీ స్థానాలలో బిజెపి 33 గెల్చుకోగలదని అంచనా వేస్తున్నది. మరో ఐదు స్థానాలను టిఎంసి గెల్చుకొనే అవకాశాలు ఉండగా, మిగిలిన 4 సాధనలలో ఆ రెండు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. వామపక్షాలు, కాంగ్రెస్ ఇక్కడ ఒక్క సీట్ కూడా గెల్చుకొనే అవకాశం లేదు.
రాజకీయంగా జంగల్ మహల్ ప్రాంతంలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు ప్రస్తుతం బిజెపికి నిబద్దత గల ఓటర్లుగా ఉన్నట్లు పశ్చిమ బెంగాల్ లో రెండు నెలలపాటు క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేసి, ఒక నివేదిక ప్రచురించిన హైదరాబాద్ కేంద్రంగా గల ఎన్నికల పర్యవేక్షణ, పరిశోధన సంస్థ ప్యూపిల్స్ పల్స్ వెల్లడించింది.
బంకురా, పురులియా, ఝార్గ్రామ్ వంటి ప్రాంతాలు రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో ఒకటి కావడం, దళితులు, ఆదివాసీయులు అధిక సంఖ్యలో ఉంటూ ఉండడంతో ప్రభుత్వ పధకాలు వారికి చేరక పోవడం, స్థానిక టిఎంసి కార్యకర్తల జీవన స్థాయి ఒకేసారి విలాసవంతంగా మారుతూ ఉండడంతో అవినీతి పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది.
More Stories
ఫలితాలతో బిజెపి ఫుల్ జోష్.. ఇక మహారాష్ట్ర, ఝార్ఖండ్ లపై దృష్టి
వైజాగ్ స్టీల్ప్లాంట్ జఠిలమైన సమస్య
చాలా రాష్ట్రాల్లో ప్రజలు కాంగ్రె్స్ కు ‘నో ఎంట్రీ’ బోర్డు