భ‌గ‌త్‌సింగ్‌, సుఖ్‌దేవ్‌, రాజ్‌గురుల‌కు పార్ల‌మెంట్ నివాళి

స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులు భ‌గ‌త్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లు వీర‌మ‌ర‌ణం పొందిన రోజు ఇవాళ‌. 90వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా రాజ్య‌స‌భ‌లో చైర్మెన్ వెంక‌య్య నాయుడు నివాళి అర్పించారు. ధైర్య‌సాహ‌సాల‌కు, దేశ‌భ‌క్తికి.. ఆ ముగ్గురి పేర్లు ఇంటి పేర్లుగా మారిన‌ట్లు వెంక‌య్య తెలిపారు. 
 
యావ‌త్ దేశానికి ఆ ముగ్గురు యోధులు ప్రేర‌ణ‌గా నిలుస్తున్నార‌ని పేర్కొన్నారు. భ‌గ‌త్ సింగ్‌, సుఖ్‌దేవ్‌, రాజ్‌గురుల‌కు నివాళిగా స‌భ్యులు నిమిషం పాటు మౌనం పాటించారు. లోక్‌స‌భ‌లోనూ ఇవాళ ప్యాన‌ల్ స్పీక‌ర్ కీర్తి సోలంకి నివాళి అర్పించారు. భ‌గ‌త్ సింగ్‌కు నివాళి అర్పిస్తూ ప్ర‌క‌ట‌న చేశారు. రెండు నిమిషాల పాటు స‌భ్యులు మౌనం పాటించారు.
 
స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులైన భ‌గ‌త్ సింగ్‌, సుఖ్‌దేవ్‌, రాజ్‌గురుల‌కు ప్రధాని నరేంద్ర మోదీ నివాళుల‌ర్పించారు. వాళ్ల త్యాగాలు ఈ దేశంలోని ప్ర‌తి త‌రానికి స్ఫూర్తిగా నిలుస్తాయ‌ని మోదీ తెలిపారు. ముగ్గురూ క‌లిసి బ్రిటీష్ పోలీస్ అధికారి జేపీ శాండ‌ర్స్‌ను హ‌త్య చేశారు.
దీంతో బ్రిటీష్ ప్ర‌భుత్వం వీరికి మ‌ర‌ణ‌శిక్ష విధించింది. అమ‌ర‌వీరుల దినోత్స‌వం నాడు విప్ల‌వ‌కారులు భ‌గ‌త్‌సింగ్‌, సుఖ్‌దేవ్‌, రాజ్‌గురుల‌కు జోహార్లు అని మోదీ ట్వీట్ చేశారు. భ‌ర‌త‌మాత ముద్దుబిడ్డ‌లైన వీళ్ల త్యాగాలు అన్ని త‌రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయ‌ని ఆయ‌న ప్రధాని పేర్కొన్నారు. బ్రిటీష్ ప్ర‌భుత్వం ఈ ముగ్గురినీ ఇదే రోజు ఉరితీసింది.