లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా సోకింది. ఈ నెల 19న ఆయన కొవిడ్ పాజిటివ్ అని తేలిందని, శనివారం ఆయన ఎయిమ్స్‌లో చేరినట్లు ఆ ఆసుపత్రి వెల్లడించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది.
ఇటీవల ఓం బిర్లాతో సన్నిహితంగా మెలిగినవారు, లోక్ సభ సభ్యులు, సిబ్బంది విధిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. కరోనా పాజిటివ్ తేలితే చికిత్స చేయించుకోవాలని వారు కోరారు.
కాగా, దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతున్నది. శుక్రవారం నుంచి శనివారం వరకు 24 గంటల్లోనే 40,953 కేసులు నమోదయ్యాయి. గత 111 రోజుల్లో ఇదే అత్యధికం. ఒక్క మహారాష్ట్రలోనే ఒక్కరోజులో ఏకంగా 27,126 కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా గత మూడు రోజుల్లోనే దేశంలో సుమారు లక్ష కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రతో పాటు పంజాబ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, హర్యానాలలో కరోనా విజృంభిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది.
గుజరాత్‌లో ఆటోరిక్షా డ్రైవర్లు, దుకాణాదారులు, సెలూన్ యజమానులకు యాంటిజెన్ పరీక్షలు నిర్వహించి కరోనా నెగెటివ్ ఐడెంటిటీ కార్డులు జారీచేయనున్నారు. తమిళనాడులో సోమవారం నుంచి 9,10,11వ తరగతులకు బడులను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
More Stories
నీట్ పేపర్ లీకేజ్‌లో 144 మందికి ప్రశ్నాపత్రం
మణిపూర్‌లో భారీగా ఆయుధాలు లభ్యం
రైలును పట్టాలు తప్పించేందుకు మరోసారి కుట్ర