ఆర్ ఎస్ ఎస్ సర్ కార్యవాహ ఎన్నిక రేపే …. ఎన్నిక విధానం!

ఆర్ ఎస్ ఎస్ సర్ కార్యవాహ ఎన్నిక రేపే …. ఎన్నిక విధానం!
శ్యామల యాదవ్ 
 
 ప్రపంచంలోనే మరే సంస్థతో పోల్చడానికి వీలులేని అతి పెద్ద స్వచ్ఛంద, సామజిక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్)లో అత్యున్నత హోదా గల వారు సర్ సంఘ్ చాలక్ అయినప్పటికీ, అతి పెద్ద కార్యనిర్వాహక పదవి (బాధ్యత) సర్ కార్యవాహసర్ సంఘ్ చాలక్ సామాన్యంగా తన వారసుడిని తానే సూచిస్తారు. జీవిత కాలమో లేదా తాను పని చేయగలిగినంత కాలమో ఈ హోదాలో కొనసాగుతూ ఉంటారు. కానీ సర్ కార్యవహ్ ను మాత్రం ప్రతి మూడేళ్లకు ఒకసారి ఎన్నుకొంటుంటారు. మొత్తం సంస్థ వ్యవస్థాగత కార్యక్రమాలకు ఆయనే బాధ్యత వహిస్తూ ఉంటారు.
 
బెంగుళూరులో నేడు, రేపు జరుగుతున్న ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభలో సర్ కార్యవాహ ఎన్నిక శనివారం జరుగనున్నది. ఈ సారి ఎన్నికయ్యేవారు 2025లో జరుగనున్న ఆర్ ఎస్ ఎస్ శతవార్షికోత్సవ కార్యక్రమాల నిర్వహణ బాధ్యత చేపట్టవలసి ఉంటుంది. సాధారణంగా ప్రతి మూడేళ్లకు ఒకసారి ఆర్ ఎస్ ఎస్ కేంద్ర ప్రధాన కార్యాలయం ఉండే నాగపూర్ లో జరిగే అఖిల భారతీయ ప్రతినిధి సభలో సర్ కార్యవహ్ ఎన్నిక జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సారి ప్రత్యేక పరిస్థితులలో బెంగళూరులో జరుగుతున్నది. 
 
దేశంలోని అని ప్రాంతాల నుండి, అన్ని పరివార క్షేత్రాల నుండి హాజరయ్యే సుమారు 1,500 మంది స్వయం సేవక్ లు ఈ ఎన్నికలో పాల్గొంటారు. అయితే ఈ సారి కరోనా మహమ్మారి దృష్ట్యా 450 మంది మాత్రమే ప్రత్యక్షంగా పాల్గొంటున్నారని అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ అరుణ్ కుమార్ తెలిపారు. 
 
ఆర్ ఎస్ ఎస్ లో అత్యున్నత విధాన నిర్ణాయక వేదిక అఖిల భారతీయ ప్రతినిధి సభ. సాధారణంగా ప్రతి ఏడాది మార్చ్ రెండు లేదా మూడో వారంలో  మూడు రోజులపాటు ప్రతినిధి సభ సమావేశాలు దేశంలో ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి. గత ఏడాది బెంగళూరులో సమావేశాలు జరుగవలసి ఉంది. కొందరు అప్పటికే సమావేశాల కోసం బెంగుళూరుకు చేరుకున్నారు కూడా. అయితే కరోనా మహమ్మారి కారణంగా సమావేశాలను రద్దు చేశారు. ఈ సారి రెండు రోజులు మాత్రమే సమావేశాలు జరుపుతున్నారు. 
 
ప్రస్తుత సర్ కార్యవాహ సంఘ్ కార్యక్రమాల నివేదిక ఇవ్వడంతో సమావేశాలు ప్రారంభం అవుతూ ఉంటాయి. నూతన సర్ కార్యవహ్ ఎన్నికకు ఒక ఎన్నికల అధికారిని సీనియర్ల నుండి ఒకరిని నియమిస్తారు. సీనియర్లలో ఒకరు సర్ కార్యవహ్ పేరును ప్రతిపాదించగా, మిగిలిన వారంతా సాధారణంగా ఆమోదం తెలుపుతూ ఉంటారు. నూతన సర్ కార్యవహ్ తన బృందాన్ని ప్రకటిస్తారు. 
 
1950వ దశకం ప్రారంభంలో సర్ కార్యవహ్ ఎన్నిక సంప్రదాయం ప్రారంభమైనది. కేవలం అత్యవసర పరిస్థితి (1975-77) సమయంలో 1993లో బాబరీ మసీద్ కూల్చివేత అనంతరం ఆర్ ఎస్ ఎస్ నిషేధానికి గురైనప్పుడు మాత్రమే ఈ ఎన్నిక పక్రియ జరగలేదు. 
ప్రస్తుత సర్ కార్యవహ్ సురేష్ భయ్యాజీ జోషి తన మూడేళ్ళ పదవీకాలాన్ని నాలుగోసారి పూర్తి చేసుకొంటున్నారు. గతంలో హెచ్ వి శేషాద్రి మాత్రమే నాలుగు పర్యాయాలు (1987 నుండి 2000 వరకు)  ఈ పదవిలో ఉన్నారు. సాధారణంగా సహా సర్  కార్యవహ్ .లలో ఒకరిని సర్ కార్యవహ్ గా ఎన్నుకొంటుంటారు.
సురేష్ జోషి కూడా మరోసారి ఎన్నిక  కావడానికి అర్హులే. ప్రస్తుతం సహా సర్ కార్యవహ్ లుగా దత్తాత్రేయ హోసబలే, సురేష్ సోని, డా. కృష్ణ గోపాల్, మన్మోహన్ వైద్య, వి భాగయ్య, సి ఆర్ ముకుంద ఉన్నారు. అయితే కొన్ని మినహాయింపులు లేకపోలేదు. 2009లో సురేష్ జోషి సర్ కార్యవహ్ గా ఎన్నికైనప్పుడు ఆయన సహా సర్ కార్యవహ్ గా లేరు. ఆయన అఖిల్ భారతీయ సేవ ప్రముఖ్ గా ఉన్నారు.
 
(ది ఇండియన్ ఎక్సప్రెస్ నుండి)