రూ 2.30 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ 

 2021-22 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్‌ను 2,30,825.96 కోట్ల రూపాయల అంచనాతో శాసనసభలో రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి హరీశ్ రావు ప్రవేశ పెట్టారు.

ఇందులో రెవెన్యూ వ్య‌యం రూ. 1,69,383.44 కోట్లు.. ఆర్థిక లోటు అంచ‌నా రూ. 45,509.60 కోట్లు.. పెట్టుబ‌డి వ్య‌యం రూ. 29,046.77 కోట్లు.. రెవెన్యూ మిగులు రూ. 6,743.50 కోట్లుగా ఉంది. కాగా బడ్జెట్‌ ప్రసంగం అనంతరం శాసనసభ శనివారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. కాగా బడ్జెట్‌లో కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి: 

ఎంబిసి కార్పొరేష‌న్ కు రూ.1,000 కోట్లు
బిసి సంక్షేమ శాఖ‌కు రూ.5,522 కోట్లు
మైనార్టీ సంక్షేమ శాఖ‌కు రూ.1,606 కోట్లు
మ‌హిళ‌ల‌కు వ‌డ్డీలేని రుణాల కోసం రూ.3,000 కోట్లు
మ‌హిళ‌, శిశు సంక్షేమ శాఖ‌కు రూ.1,702 కోట్లు

రైతు బంధుకు రూ.14,800 కోట్లు
రైతుల రుణ‌మాఫీకి రూ.5,225 కోట్లు
వ్య‌వ‌సాయ శాఖ‌కు రూ.25 వేల కోట్లు
ప‌శు సంవ‌ర్థ‌క శాఖ‌కు రూ.1,730 కోట్లు
నీటి పారుద‌ల శాఖ‌కు రూ.16,931 కోట్లు
స‌మ‌గ్ర భూస‌ర్వేకు రూ.400 కోట్లు

ఆస‌రా పింఛ‌న్ల‌కు రూ.11,728 కోట్లు
క‌ల్యాణ ల‌క్ష్మి, షాదీ ముబార‌క్‌కు రూ.2,750 కోట్లు
ఎస్సి ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధికి రూ.21,306.85 కోట్లు
ఎస్టిల ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధికి రూ.12,304.23 కోట్లు
ఎస్టి గృహాల‌కు రాయితీపై విద్యుత్ కు రూ.18 కోట్లు
మూడు ల‌క్ష‌ల గొర్రెల యూనిట్ల కోసం రూ.3,000 కోట్లు
బిసిల‌కు క‌ల్యాణ‌ల‌క్ష్మికి అద‌నంగా రూ.500 కోట్లు

రైతుల సంక్షేమం కోసం రూ.338 కోట్లు
కొత్త స‌చివాల‌య నిర్మాణానికి రూ.610 కోట్లు
దేవాదాయ శాఖ‌కు రూ.720 కోట్లు
అట‌వీ శాఖ‌కు రూ.1,276 కోట్లు
ఆర్టిసికి రూ.1,500 కోట్లు
మెట్రో రైలుకు రూ.1,000 కోట్లు

ఒఆర్ఆర్ లోప‌ల కొత్త కాల‌నీల్లో తాగునీరు కోసం రూ.250 కోట్లు
వరంగ‌ల్ కార్పొరేష‌న్‌కు రూ.250 కోట్లు
ఖ‌మ్మం కార్పొరేష‌న్‌కు రూ.150 కోట్లు
ఆర్ అండ్ బి రోడ్ల మరమ్మత్తులు-రూ 800 కోట్లు
పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మత్తులు- రూ300 కోట్లు

కమాండ్ కంట్రోల్ సెంటర్, పోలీసు కార్యాలయాలు -రూ. 725కోట్లు
కొత్త సచివాలయం – రూ.610 కోట్లు
ఆర్వోబీలు, ఆర్ యుబిలు- రూ. 400కోట్లు
రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ – రూ 750 కోట్లు
ద్వితీయశ్రేణి నగరాల్లో ఎయిర్ స్ట్రిప్ ల అభివృద్ధి- రూ .100 కోట్లు