తెలుగు రాష్ట్రాలహైకోర్టుల్లో 28 న్యాయమూర్తులు ఖాళీ

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో 18, తెలంగాణ హైకోర్టులో 10 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీచేయాల్సి ఉందని కేంద్రం తెలిపింది. ఏపీ హైకోర్టుకు 37 మంది న్యాయమూర్తులు మంజూరు కాగా 19 మంది విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపింది. 
 
కాంగ్రెస్‌ సభ్యురాలు జోత్య్స చంద్రస్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ లోక్‌సభలో ఈ సమాధానమిచ్చారు.  తెలంగాణ హైకోర్టులో ఉండాల్సిన 24 మంది న్యాయమూర్తులకుగాను ప్రస్తుతం 14 మంది ఉన్నారని పేర్కొన్నారు.
 
తెలంగాణలోని కింది కోర్టుల్లో ఉండాల్సిన 474 మంది జడ్జిలకుగాను 378 మంది ప్రస్తుతం ఉన్నారని, 96 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏపీలో 607 జడ్జి పోస్టులకుగాను 97 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు.