సోషల్ మీడియా కట్టడికి నియంత్రణ సంస్థను ఏర్పాటుచేసే ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు వెల్లడించింది. అయితే సోషల్ మీడియా, ఓటీటీ వేదికల్లో కంటెంట్‌ను నియంత్రించేందుకు ఐటీ చట్టం కింద ఫిబ్రవరిలో కొత్త నిబంధనలు జారీచేసినట్టు కేంద్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.
దీని ప్రకారం ఆయా వేదికలు ఫిర్యాదు పరిష్కార వ్యవస్థలను ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. కాగా,దేశద్రోహ చట్టం సహా క్రిమినల్ చట్టాల్లో సంస్కరణలకు సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు, స్వచ్ఛంద సంస్థల నుంచి సూచనలు కోరామని కేంద్రం వెల్లడించింది. దీనిపై ఒక కమిటీని కూడా ఏర్పాటుచేసినట్టు రాజ్యసభకు తెలిపింది.
ఎన్నార్సీని (జాతీయ పౌర పట్టిక) దేశవ్యాప్తంగా అమలుచేయడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం రాజ్యసభకు తెలిపింది. శాసన, కార్యనిర్వాహక, న్యాయ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులను ‘కేంద్ర ప్రభుత్వ అధికారులు’ అని సంబోధించడానికి బదులుగా ‘భారత యూనియన్ అధికారులు’ అని పిలువాలని పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదించింది.
కేంద్ర ప్రభుత్వంలో 3 సంయుక్త కార్యదర్శుల పోస్టులు, 27 డైరెక్టర్, 13 డిప్యూటీ కార్యదర్శుల పోస్టుల్లో ప్రైవేట్ నిపుణులను నియమించనున్నట్టు కేంద్రం బుధవారం లోక్‌సభకు తెలిపింది. జైళ్లలో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక వసతి కల్పించాలన్న రాజ్యసభ సభ్యుల ప్రతిపాదనను పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలిపింది.
More Stories
శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత
భారత్ లో ఇంటర్నెట్ వినియోగదారులు 90 కోట్లు
బస్తర్ ప్రాంతంలో 12 మంది నక్సల్స్ హతం!